Kishan Reddy : బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో తెలంగాణను దోచుకున్నారని విమర్శించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో తెలంగాణ ప్రజలను దోచుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని సూచించారు. కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించబోతున్నారని అన్నారు.
తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయరహదారులు రెండు రెట్లు పెరిగాయన్నారు. పదేళ్లలో మరో 2500 కి.మీ మేర జాతీయరహదారుల నిర్మాణం జరిగింది..కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునీకరణ జరిగింది. ..రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టిందన్నారు. ఇప్పటికే 3 వందేభారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంటు మంజూరు చేశారన్నారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో తెలంగాను దోచుకున్నారని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా.. ఏ రకమైన మార్పు కనపడటం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ ను బెదిరించి రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలే. దీనికి తోడుగా ఎంఐఎం పార్టీ కలిసిందని ఆరోపించారు. కుహనాలౌకికవాదం, ఓటుబ్యాంకు రాజకీయాలతో తెలంగాణ ప్రజలను దోచుకున్నారన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసి, అధికారం పంచుకున్న పార్టీలేనన్నారు. ఈ మూడు పార్టీలు ఒకేతానుముక్కలని స్పష్టం చేశారు. తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలలని పిలుపునిచ్చారు. కేసీఆర్ .. తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని చూస్తారు.. కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని చూస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అన స్పష్టం చేశారు. దేశంలో నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానిగా విజయం సాధించబోతున్నారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఏనాడు మాట తప్పలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలు తూ.చ తప్పకుండా అమలు చేసి చూపించారన్నారు. మోదీ గారు గ్యారంటీ ఇచ్చారంటే జరిగి తీరుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని.. తెలంగాణలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాననని ప్రసంగించారు.