Ganesh Immersion Live Updates: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర

Hyderabad News: గణేష్ నిమజ్జనం ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Ganesh Guptha Last Updated: 17 Sep 2024 01:37 PM
Khairatabad Bada Ganesh Nimajjanam 2024: ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం

Khairatabad Bada Ganesh Nimajjanam 2024: ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తైంది. నాల్గో నెంబర్ క్రేన్ దగ్గర ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఉదయం ఆరు గంటలకు మొదలైన శోభాయాత్ర ఇప్పటి వరకు సాగింది. 

Khairatabad Ganesh Nimajjanam:ముగిసిన ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర

Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ముగిసింది. నాల్గో నెంబర్ క్రేన్ దగ్గర నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లో ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 

Khairatabad Ganesh Nimajjanam: సచివాలయం దాటిన ఖైరతాబాద్ గణేష్‌

Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేషుడు కాసేపట్లో గంగ ఒడికి చేరుకోనున్నాడు. ఉదయం  మొదలైన శోభయాత్ర ఇంకా కొనసాగుతోంది. కాసేపటి క్రితం సచివాలయం దాటి ముందుకు కదులుతోంది.  

Khairatabad Ganesh Nimajjanam 2024: తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్‌

Khairatabad Ganesh Nimajjanam 2024: ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. భారీ భక్త జనసందోహం మధ్య కనుల విందుగా సాగిపోతున్నాడు గణనాథుడు. ప్రస్తుతం ఈ శోభయాత్ర తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌  వద్దకు చేరుకుంది. 









Balapur Ganesh Laddu Auction 2024: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం

Balapur Ganesh Laddu Auction 2024: కాసేపట్లో బాలపూర్ గణేషుడి లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం నుంచి జరిగిన శోభయాత్ర కాసేపట్లో ఊరి పొలిమేరకు చేరుకోనుంది. అక్కడకు వినాయకుడు వచ్చిన తర్వాత వేలం పాటను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నలుగురు వ్యక్తులు తలో 27 లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. వాళ్లు మాత్రమే ఈసారి వేలంలో పాల్గొంటారు. 

Khairatabad Vinayaka Nimajjanam:నిజ్జనానికి కదలిన ఖైరతాబాద్ వినాయకుడు

Vinayaka Nimajjanam: ఖైరతాబాద్ మహాగణపతి యాత్ర తెల్లవారుజామునే మొదలైంది. అర్థారాత్రి ఆఖరి పూజను పూర్తి చేసి నిమజ్జనానికి మహాగణపతిని తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఉదయం ఐదు గంటల నుంచే శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మహాగణపతి ఊరేగింపు ఖైరతాబాద్‌ వద్ద కొనసాగుతోంది. మధ్యాహ్నానికి మహాగణపతిని గంగ ఒడికి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

వేలంలో లడ్డూను కైవసం చేసుకున్న ముస్లిం యువకుడు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా భట్ పల్లీలో గణేష్ లడ్డూను ముస్లిం యువకుడు సొంతం చేసుకున్నాడు.  శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డూ వేలం కార్యక్రమం జరిగింది.  అదే కాలనీకి చెందిన ముస్లిం యువకుడు అఫ్జల్  ముస్కాన్ వేలంలో రూ.13,216/ ల‌కు లడ్డూ కైవసం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి  యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Ganesh Nimajjanam 2024 Hyderabad: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం - ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్లివే

Ganesh Nimajjanam 2024 Live Updates: గణేష్ నిమజ్జనానికి సిద్ధమవుతోన్న భాగ్యనగరంలో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగిస్తే నిమజ్జనం ప్రశాంతంగా వీక్షించవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్లు 9010203626, 8712660600, 040 - 27852482 కి ఫోన్ చెయ్యొచ్చని తెలిపారు.

Ganesh Immersion 2024 Live Updates: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం - ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Nimajjanam 2024 Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం దృష్ట్యా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకూ భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నగరంలోకి అనుమతించరు. మొత్తం 67 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

Ganesh Immersion 2024: ఉదయం 6:30 గంటలకు ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర - 56 సీసీ కెమెరాలతో నిఘా

Ganesh Immersion 2024 Live Updates: మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ 700 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. యాత్ర జరిగే మార్గంలో 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు రహదారులపై ఉన్న కెమెరాలతోనూ భద్రతను పర్యవేక్షించనున్నారు.

Ganesh Immersion 2024: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం - 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

Ganesh Immersion 2024 Live Updates: జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బందోబస్తు విధుల్లో 25 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు. కేవలం హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్ పహారా కాయనున్నాయి.

2023లో ఏకంగా రూ.27 లక్షల రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేషుడి లడ్డూ

బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. 2023లో ఏకంగా రూ.27 లక్షల రికార్డు ధరకు గణేషుడి లడ్డూను ఓ భక్తుడు సొంతం చేసుకున్నారు. దాసరి దయానంద్‌ రెడ్డి రూ.27 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కించుకున్నారు.

Balapur Ganesh Laddu Auction 2024: ఇప్పుడు అందరి నోటా వినిపించే మాట బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం

Balapur Ganesh Laddu Auction 2024: హైదరాబాద్ లో ఫేమస్ అంటే ఖైరతాబాద్ మహాగణపతి, రెండో గణేష్ బాలాపూర్ వినాయకుడు అని తెలిసిందే. కొన్ని దశాబ్దాల నుంచి ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ లో గణేష్‌, బాలాపూర్ గణేష్ లను నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. 70 ఏళ్లు పురస్కరించుకుని, ఈ ఏడాది ఖైరతాబాద్ లో 70 అడుగుల   మహాగణపతిని ఏర్పాటు చేసి పూజలు చేశారు. సెప్టెంబర్ 15 అర్ధరాత్రితో భక్తుల సందర్శన ముగియగా... ఇప్పుడు అందరి నోటా వినిపించే మాట బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ధరపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.


హాజరైన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు.


గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన    ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు వివరించిన సీపీ.


ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన  మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించిన సీఎం.


పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి  కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని సూచించిన సీఎం.


సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్న సీఎం.


బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని ఆదేశించిన సీఎం.


ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.

Background

Ganesh Nimajjanam 2024 Live Updates: నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. భాగ్యనగరంలో మంగళవారం గణేష్ నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ట్యాంక్ బండ్ చుట్టూ 135, మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 300కు పైగా క్రేన్లు అందుబాటులో ఉంచారు. మంగళవారం ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు మహా హారతి, 11:30 గంటలకు కలశపూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహాగణపతి విగ్రహాన్ని టస్కర్‌పైకి ఎక్కిస్తారు. అటు, శోభాయాత్ర భద్రత కోసం పోలీస్ శాఖ 25 వేల మంది సిబ్బందిని కేేటాయించింది. బుధవారం సాయంత్రం వరకూ నగరంలోని అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని భావిస్తున్నారు. అటు, చివరి రోజు ఖైరతాబాద్ గణేశున్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.


జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు


అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మరోవైపు, గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా అర్ధరాత్రి వరకూ ఎంఎంటీఎస్ రైళ్ల అదనపు సర్వీసులు నడపనున్నట్లు ద.మ రైల్వే అధికారులు తెలిపారు. ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులు నడపనుంది. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.