KCR meeting with senior BRS leaders On Kaleshwaram Report: కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కేబినెట్  ముందుకు రానున్న సమయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీ ముఖ్య నేతలతో ఫామ్ హౌస్ లో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి వంటి నేత నేతలు ఫామ్ హౌస్ లో ఉన్నారు. వారితో కేటీఆర్ రెండు, మూడు గంటల పాటు విస్తతంగా చర్చలు జరిపారు. కాళేశ్వరం రిపోర్టులో ప్ధానంగా కేసీఆర్  తప్పులు చేశారన్న రిపోర్టు వచ్చిందన్న ప్రచారం జరుగుతూతూండటంతో తదుపరి తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణకు తలమానికంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని.. అన్ని నిబంధనల ప్రకారమే జరిగినా చట్టబద్ధత లేని కమిటీని నియమించి కేసీఆర్ ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నరాు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది  మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కాళేశ్వరం కూలిపోయిందన్న ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కుట్రలను రాజకీయందా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కష్టంగా మారిందని అందుకే కాళేశ్వరం నివేదిక పేరుతో హడావుడి చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు కేబినెట్ ముందుకు రాక ముందే మీడియాలో ప్రచారం కావడంపై కుట్ర ఉందని కేసీఆర్ అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై  తప్పుడు ప్రచారం చేసేందుకే కమిటీ రిపోర్టును లీక్ చేశారన్న అభిప్రాయం వినిపస్తోంది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని..  ప్రభుత్వం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ పార్టీ నేతలుక సూచించారు. కాళేశ్వరం నుంచి లక్ష ఎకరాలకు నీళ్లిచ్చామని ప్రజలు ఈ అంశాలను మర్చిపోరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

కాళేశ్వరం రిపోర్టులో ఏముందంటే ?

కాళేశ్వరం  ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ జవాబుదారు అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.  కేసీఆర్  మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూ బాధ్యత ఉందన ితెలిపింది.   కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని క్యాబినెట్ ఆమోదం లేకుండా చేపట్టారని ... అప్పటి నీటిపారుదల మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు సైతం దీనికి బాధ్యులు అని కాళేశ్వరం కమిషన్ నివేదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించినందుకు, తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు ఆరుగురు నీటిపారుదల ఇంజనీర్లపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా తమ నివేదికలో కమిషన్ సిఫార్సు చేసింది.   రాజకీయంగా వ్యక్తిగత నిర్ణయాలు, ఇటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కు కావడంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జాధనం దుర్వినియోగమైందని కమిషన్ నివేదికలో పేర్కొంది.  తెలంగాణ కేబినెట్ భేటీలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై సమగ్రంగా చర్చ జరగనుంది.