KCR Tour :  అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులకు కేసీఆర్ పరిహారం ప్రకటించారు. ఎకరానికి రూ. పదివేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. మూడు జిల్లాల్లో పంట నష్టపోయిన ప్రాంతాలను కేసీఆర్ పరిశీలించనుననారు.  ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో కేసీఆర్ పంటాలను పరిశీలించారు.  ముందుగా  ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు.  


కేంద్రానికి నివేదికలు పంపడం లేదన్న కేసీఆర్                                                         


కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని..  కేంద్రానికి నివేదికలు పంపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.  పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.  మొత్తం 79 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి గురైందని సీఎం కేసీఆర్ తెలిపారు. గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం వాటిల్లిందన్న ఆయన.. రైతులు నిరాశకు గురికావల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పంట నష్టపరిహారంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా నష్టపరిహారం ఇవ్వలేదని.. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి రిపోర్ట్స్ పంపమని సీఎం చెప్పారు. 


తెలంగాణ రైతులను సౌంతంగా ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటన                                   


తమ రైతులను తామే ఆదుకుంటామన్నారు. దేశంలోనే మొదటిసారి సహాయ పునరావాస చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని, కౌలు రైతులను సైతం ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. వాళ్లక్కూడా న్యాయం చేస్తామన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228కోట్లను ఇప్పుడే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.


మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన 


ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెల్లి అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు