KCR has decided to appear before the Kaleshwaram Commission : భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.  కాళేశ్వరం కమిషన్ విచారణకు నిర్ణయించుకున్నారు. జూన్ ఐదో తేదీన హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేిసంది. హాజరు కాకపోతే  అక్కడేదో తప్పు జరిగిపోయిందని..దానికి కేసీఆరే బాధ్యుడని అందుకే తప్పించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు.ఐదో తేదీన రావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా నోటీసులు జారీ చేసింది.తాను హాజరవుతానని ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్ హాజరవుతున్నందున.. హరీష్ రావు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.                      

కేసీఆర్ పదేళ్లు సీఎంగా చేశారు. ఆయన కమిషన్ ముందు హాజరవడం వల్ల ఆయన ఇమేజ్ కు సమస్య వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తూ వచ్చాయి.  . ఆ నోటీసులు దూది పింజతో సమానం అని కేటీఆర్ కూడా  చెప్పారు. ఈ మాటల్ని బట్టి కేసీఆర్ విచారణకు హాజరు కారని.. కావాలంటే ప్రశ్నలు పంపిస్తే సమాధానాలివ్వడమో లేకపోతే కోర్టుకు వెళ్లడమో చేస్తారని అనుకున్నారు. కానీ న్యాయనిపుణులతో సంప్రందించిన తర్వాత హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరంకు పని చేసిన పలువురు అధికారులు తాము కేసీఆర్  చేప్పిందే చేశామని వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.                            

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ పీసీ ఘోష్​ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్​ నిర్మాణం, డిజైన్​, నిర్వహణ, పే అండ్​ ఎకౌంట్స్​, క్వాలిటీ కంట్రోల్​, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల, నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించింది. ఇటీవల   కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్  ముగ్గుర్ని ప్రశ్నించకుండానే నివేదిక సమర్పించాలని జస్టిస్ పీసీ ఘోష్ అనుకున్నట్లుగా ప్రచారం జరిగింది. సీఎంగా ఉన్న కేసీఆర్​ కొంత కాలం ఇరిగేషన్ శాఖను కూడా చూసుకున్నారు. తర్వాత  కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్​రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు.   ఈటల రాజేందర్​ అనంతరం పరిణామాలతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అయితే రెండు నెలల పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ వ్యవధిని పొడిగించిన తర్వాత..నోటీసులు జారీ అయ్యాయి. ఈ ముగ్గుర్ని ప్రశ్నించిన తర్వాత నివేదిక సమర్పించే అవకాశం ఉంది.  

కేసీఆర్ నిర్ణయంతో రాజకీయం అనూహ్యంగా మారిపోనుంది. కాంగ్రెస్ విమర్శలకు అవకాశం లేకుండా పోతుంది. రాజకీ.య కక్ష సాధింపు కోసమే  ఈ విచారణ అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ తప్పేం జరగలేదని కమిషన్ ద్వారానే నిరూపిస్తామని అంటున్నారు.