KCR : దేశాన్ని కుల, మత ఉన్మాదంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మౌనం వ‌హించ‌డం స‌రికాదన్నారు. అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదు... ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మా స‌క్ర‌మ‌మైన మార్గంలో నడపాలని పిలుపునిచ్చారు. ప్రాణ‌, ఆస్తి త్యాగాలు, అమూల్య‌మైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బ‌లిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వ‌చ్చిందన్నారు. విశ్వ‌జ‌నీన‌మైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంత‌టి శ‌క్తిశాలులైనా స‌రే శాంతియుత ఉద్య‌మాల‌తో జ‌యించొచ్చ‌ని ప్ర‌పంచ మాన‌వాళికి సందేశం ఇచ్చిన మ‌హ్మ‌త్ముడు పుట్టిన గ‌డ్డ మ‌న భార‌తావ‌నిఅని..  ఈత‌రం పిల్ల‌ల‌కు గాంధీ గురించి  తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.


స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందడం లేదు


పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌డ‌టం లేదు. అడుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌ని ఆవేద‌న మ‌న‌కు క‌న‌బ‌డుతుంద‌ని కేసీఆర్ తెలిపారు. వాట‌న్నింటిని విస్మ‌రించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నాం. మౌనం వ‌హించ‌డం స‌రి కాదన్నారు.  అద్భుత‌మైన ప్ర‌కృతి సంప‌ద‌తో, ఖ‌నిజ సంప‌ద‌తో యుశ‌క్తితో, మాన‌వ‌సంప‌త్తితో ఉన్న ఈ దేశం పురోగ‌మించ‌డం లేదు. స్వాతంత్య్ర ఉద్య‌మ స్ఫూర్తితో ఉజ్వ‌ల‌మైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. ఈ క్ర‌మంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకున్నాం. గ్రామాల్లో, ప‌ట్ట‌ణాల్లో స్వ‌తంత్ర ఉద్య‌మంపై చ‌ర్చ జ‌రిగింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు.


కోటి మంది సామూహిత  జాతీయ గీతాలాపన రికార్డు 


 సామూహిక జాతీయ గీతాలాప‌న చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏక‌కాలంలో ఆల‌పించ‌డం తెలంగాణ రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణం అని సీఎం పేర్కొన్నారు. మ‌హాత్ముడు విశ్వ‌మాన‌వుడు. కొంద‌రు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయ‌న గొప్ప‌త‌నాన్ని యూఎన్‌వో ప్ర‌శంసించింది. అంత‌ర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్ర‌హాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భార‌త‌దేశానికి గ‌ర్వ‌కార‌ణం అని  చెప్పారు.  .


గాంధీ స్ఫూర్తి అందరికీ రావాలి 


గాంధీ సినిమాను 22 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు చూశారంటే 10 శాతం మందికి స్ఫూర్తి క‌లిగిన కూడా ఈ దేశం బాగా పురోగ‌మించ‌డానికి వారి శ‌క్తిసామ‌ర్థ్యాలు వినియోగిస్తున్నార‌ని న‌మ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొన‌సాగాలి. గాంధీ మార్గంలో దేశం పురోగ‌మించాలి. అహింసా సిద్ధాంతాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ సాధించాం. ఏ విధంగా పురోగ‌మిస్తున్నామో మ‌న‌కు తెలుసు. చాలా గొప్ప‌గా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన అంద‌రికీ, అల‌రించిన క‌ళాకారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నానన్నారు. . దేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించింది.