Breaking News Live: ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం, ఇబ్బందులు పడ్డ వినియోగదారులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Feb 2022 10:57 PM

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో...More

ట్విట్టర్ సేవలకు కాసేపు అంతరాయం, ఇబ్బందులు పడ్డ వినియోగదారులు 

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు గురువారం రాత్రి కొంత సమయం నిలిచిపోయాయి. సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా నావిగేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు స్క్రీన్‌పై 'ఏదో తప్పు జరిగింది' 'మళ్లీ ప్రయత్నించండి' వంటి సందేశాలు వచ్చాయని వినియోగదారులు పేర్కొన్నారు. కొంతమంది వినియోగదారులకు ట్వీట్ చేయడంలో సమస్య ఉంది, మరికొందరు ఇప్పటికే ఉన్న ట్వీట్‌పై కామెంట్స్ లోడ్ చేయలేకపోయారు. ట్విట్టర్ సపోర్ట్ అధికారిక హ్యాండిల్‌కు కూడా స్క్రీన్‌పై లోడ్ చేయడంలో సమస్య ఉందని వచ్చిందని తెలుస్తోంది.