Kavitha gives strong warning to BRS leader Niranjan Reddy: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నా. ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె వనపర్తిలో పర్యటించారు.అక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇక్కడి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటోందని.. మూడు, మూడు సార్లు 32 మంది బీసీల పై అన్యాయంగా కేసులు పెట్టించాడన్నారు.
నిరంజన్ రెడ్డి మూడు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. కష్ం చేసి కట్టుకుంటే సరే...కృష్ణా నదిని కబ్జా చేసి కట్టుకున్నారన్నారు. ఈ విషయం కేసీఆర్ గారి తెలియదా? హరీష్ రావు గారు తన మనిషి అని కేసీఆర్ గారికి తెలియకుండా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. నిరంజన్ గారి అరాచకాలు ఘోరతి ఘోరంగా ఉన్నాయని చిన్నపిల్లాడిని అడిగిన చెబుతున్నారని.. ఇలాంటి వ్యక్తి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మీరు ఎమ్మార్వో ఆఫీస్ తగలబెట్టారు. కేసీఆర్ గారికి అది తెలిసినా ఊరుకుంటే మాత్రం అది తప్పేనన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ప్రజల రక్తం తాగుతారా? ఎదుల రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేయలేదు. కానీ మీకు మీరే నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు. జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. పాత వాటికే కనెక్ట్ చేసి నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవటం సరికాదు. పెబ్లేరు సంత చాలా ఫేమస్. అక్కడ 32 ఎకరాలను నిరంజన్ రెడ్డి మనుషులు కబ్జా పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వనపర్తి, పెబ్బేరు ఎక్కడైనా కబ్జాలేనా? నిరంజన్ రెడ్డి గారి భూదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యక్తులను ఏ పార్టీ కూడా ఎంకరేజ్ చేయవద్దని..ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బతికి బట్టకట్టదన్నారు. హరీష్ రావు మనిషి కాబట్టే నిరంజన్ రెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవటం లేదన్నారు. నేను చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేద్నారు. మీ అరాచకాలు కేసీఆర్ గారి తెలియవని అనుకుంటున్నా. అందుకే మీడియా ద్వారా చెబుతున్నానన్నారు. ఇలాంటి వాళ్లను ప్రజల మీదకు రుద్దటం అన్యాయమన్నారు.
తెలంగాణ తెచ్చుకున్నదే బీమా, నెట్టంపాడు, కల్వకుర్తి లాంటి ప్రాజెక్ట్ లు పూర్తి చేయటానికి. కానీ ఇప్పుడు వరకు అది జరగలేదన్నారు. 2004, 2005 లోనే ఇక్కడ ప్రజల భూములు తీసుకున్నారు. వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. పైగా ఇష్టమున్నట్లు గేట్లు ఎత్తటంతో సగం ఊళ్లోకి నీళ్లు వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రావుల చంద్రశేఖర్ రావు గారు మంచి మనిషి. అవినీతి మరక లేని వారు. ఆయన కేసీఆర్ గారికి ఈ విషయాన్ని చెప్పి ప్రజలకు న్యాయం చేయాల్సిందన్నారు. ఇప్పటికైనా ఈ అంశంలో ఇక్కడి ప్రజల తరఫున ముందుండి పోరాడాలని కోరారు.