YS Sharmila: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం చిగురుటాకుల వణికిపోయింది. భారీ వరదల కారణంగా చాలా మంది నష్టపోయారు. అయిలే ఈ వర్షాల కారణంగా సర్వం పోగొట్టుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇంత వరకు సాయం చేయకపోవడంపై.. వైఎస్ వైఎస్సార్ టీపీ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ సర్కారు ఉన్నట్లా చచ్చినట్లు అంటూ వ్యాఖ్యానించారు. వరద బాధితుల పరామర్శ యాత్రలో భాగంగా ఆమె గురువారం జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఇందిరమ్మ కాలనీలో, మంచిర్యాల పట్టణంలోని గణేష్ నగర్, పద్మశాలీవాడ, రామ్ నగర్, ఎన్టీఆర్ కాలనీల్లో ఆమె పర్యటించారు.
సీఎం వైఫల్యం వల్లే ఇన్ని నష్టాలు..
ఈ సందర్భంగా వర్షాల వల్ల నష్టపోయిన బాధితులు షర్మిల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సర్కారు నుంచి పైసా కూడా అందలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. వరద బాధితుల గోస చూసి షర్మిల చలించిపోయారు. అనంతంర ఆమె మాట్లాడుతూ... వరదలను ముందుస్తుగా అంచనా వేయలేకపోవడంతోనే భారీ నష్టం జరిగిందని ఇది సీఎం కేసీఆర్ వైఫల్యమేనని ధ్వజం ఎత్తారు. తెలంగాణ ప్రజల కష్ట సుఖాలుు తెలుసుకునేదుకు రాజన్న బిడ్డగా ప్రజల ముందుకు వచ్చానని... రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని కోరారు.
25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలి..
వరద బాధితులకు పది వేలు కాదు.. 25 వేల చొప్పు టీఆర్ఎస్ పార్టీ ఖజానా నుంచే చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాలో 860 కోట్లు ఉన్నాయని అంటున్నారు. నెలకు 3 వేల కోట్లు వడ్డీ చొప్పున 25 వేల కోట్ల రూపాయలు వస్తున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి కాకుండా ఆ పార్టీ ఖజానా నుంచే చెల్లించాలని వైఎస్ షర్మిల అన్నారు. వరద బాధితులు అందరికీ ఆర్థిక సాయం చేయాలన్నారు. చాలా మంది ఇళ్లు కోల్పోయారని, వేలాది ఎకరాల పంట నీటి పాలవడంతో.. అన్నదాతలు ఆగమయ్యారని అన్నారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వరదలపై ముందస్తు అంచనా వేస్తే నష్టం తగ్గేది..
సీఎం వెళ్లిన ప్రాంతాల్లోనే పది వేలు సాయం చేస్తారా.. ఇక్కడి వాళ్లకు ఇవ్వరా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు మనుషులు కాదా అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. కడెం, ఎల్లంపల్లి, వరద నష్టంపై ముందే అంచనా వేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. పే స్కేల్ అమలు చేయాలని నిరసన చేపట్టిన వీఆర్ఏలకు షర్మిల మద్దతు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా నిర్దాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించారని ధ్వజమెత్తారు.