Bandi Sanjay in Phone Tapping Case | కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లతో పాటు సినీ నటులు, రియల్ ఎస్టేట్, జడ్జిల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపణలున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ సైతం ట్యాపింగ్ అయిందని బయటకు వచ్చింది. ఈ క్రమంలో సిట్ ఫోన్ కాల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, త్వరలో విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై అందరి కంటే ముందు అరోపణలు చేసింది తానే అన్నారు. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రం గా పోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకిఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా మంది సంసారాలు నాశనం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పలువురి ఉసురు పోసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పజెప్పాలి. జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయ్యాయి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌కు కారణమైన కేసీఆర్, కేటీఆర్‌లకు ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు.
ప్రభాకర్ రావుకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి.అందరి జీవితాలు నాశనం చేసిందే అతడు. ప్రభాకర్ రావు అదేశాల మేరకే నన్ను పేపర్ లీక్ అయ్యిందని గతంలో నన్ను అరెస్టు చేశారు. అనుమానం పుట్టాకే కేసీఆర్ పుట్టారు. కేసీఆర్ హయాంలో మామూలు ఫోన్ మాట్లాడాలంటేనే భయం. ఫేస్ టైం, సిగ్నల్ యాప్ లలోనే ఫోన్ మాట్లాడుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో ని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణని సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ అని, ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు. కేటీఆర్ అమెరికాకి పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తరయవాతనే ఆయన ఇండియాకి తిరిగొచ్చాడు’ అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.