Karimnagar Crime News: కరీంనగర్‌లో వెలుగు చూసిన ఓ హత్య కేసు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణంగా ప్రేమించిన భర్తను కర్కశంగా చంపేయడంతో పోలీసులే షాక్ అయ్యారు. మద్యానికి బానిసైన వ్యక్తి డబ్బులు ఇవ్వాలని నిత్యం వేధిస్తున్నాడు. ఆ బాధలను భరించలేక స్పాట్ పెట్టి ఖతం చేసింది. కానీ తర్వాత మేనేజ్ చేయడం రాక పోలీసులకు చిక్కింది. 

Continues below advertisement

కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో కత్తి మౌనిక, సురేష్ నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో డబ్బుల కోసం భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యానికి డబ్బులు కావాలంటూ ఆమెను చిత్రవధ చేశాడు. 

భర్త సురేష్ వేధింపులు భరించలేక మౌనిక తప్పుడు మార్గం పట్టింది. సెక్స్‌వర్కర్‌గా మారి డబ్బులు సంపాదించడం ప్రారంభించింది. అలా సంపాదించి ఇస్తున్న డబ్బులు ఇస్తున్నప్పటికీ భర్తకు సంతృప్తి కలగలేదు. దీంతో భర్త పీడ వదిలించుకుంటే ప్రశాంతంగా జీవించవచ్చని భావించిందేమో. బంధువులతో తన మనసులో మాటను చెప్పింది. వారించాల్సిన వాళ్లు కూడా ప్రోత్సహించారు.       

Continues below advertisement

సురేష్ హత్యకు ప్లాన్ చేసిన మౌనిక తన బంధవులకు సలహా అడిగింది. వయాగ్రా మాత్రలు కొనుక్కొని వచ్చి ఎందులోనైనా కలిపి ఇవ్వాలని చెప్పారు. అన్నట్టుగానే వయాగ్రా మాత్రలు కొనుక్కొని వచ్చిన మౌనిక ఒక రోజు కూరలో వయాగ్రా మాత్రలు కలిపేసి వడ్డించింది. తింటున్న క్రమంలో ఏదో తేడాగా ఉందని అన్నాడు. వాసన వస్తుందని తినడం మానేశాడు. దీంతో మొదటిసారి మర్డర్ స్కెచ్‌ ఫెయిల్ అయ్యింది.         

దీంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేసింది మౌనిక. బీపీ, నిద్రమాత్రులు పొడి చేసింది. వాటిని సురేష్ తాగే మద్యంలో కలిపేసింది. ఆ విషయం గుర్తించ లేకపోయిన సురేష్ వాటిని తాగేశాడు. అంతే నిద్రలోకి జారుకున్నాడు. అలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత జాగ్రత్త ఆయన మెడకు చీరను బిగించింది. తర్వాత కిటికీ గ్రిల్‌కు వేలాడదీసింది. చనిపోయిన తర్వాత బెడ్‌పై వేసింది. లైంగిక చర్యలో పాల్గొంటూ పడిపోయాడని అత్తమామలకు చెప్పింది.       

మౌనిక మాటలు విన్న అత్తమామ వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. మెడపై మచ్చలు ఉండటంతో వైద్యులకు అనుమానం వచ్చింది. విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి అనుమానాస్పద కేసుగా రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు. మౌనిక చెప్పే మాటలు పొంతన లేకపోవడంతో ఆమెపై నిఘా పెట్టారు.        భర్త చనిపోయాడన్న బాధ లేని మౌనికను పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమె తీరు, ఫోన్ కాల్స్‌, ఇతర అన్ని విషయాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే మౌనిక అసలు రూపం తెలిసింది. అంతే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించింది. ఆమె చెప్పే మాటలు విన్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు. ఆమెతోపాటు ఆమెకు సహకరించిన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు.