వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం చూపిస్తున్న వివక్షపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌కో న్యాయం తెలంగాణకో న్యాయం ఎందుకని ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్రం ఎందుకింత మొండిగా ఉంటుందో అర్థం కావడం లేదన్నారు హరీష్. ఇక కేంద్రం, బీజేపీ తీరుకు నిరసనగా ఆందోళనలు ఉద్దృతం చేయాలని ఆదేశించారాయన.
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్న హరీష్ రావు టీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంటిపై నల్లజెండాలు ఎగరవేయాలని సూచించారు. అలాగైన బీజేపీ లీడర్లకు బుద్ది వస్తుందన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్ష అన్ని ప్రాంతాల్లో చర్చజరాగాలన్నారు. ప్రతి గ్రామంలో తీర్మానం చేసి పీఎంకి పంపించాలని సూచించారు.
సిద్దిపేటలో మాట్లాడిన హరీష్ గతంలో అన్ని ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు చేశాయని ఇప్పుడే కేంద్రం ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెట్టి రైతుల గొంతు కోస్తుందన్నారు హరీష్. తెలంగాణ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదమన్న ఆయన... పంజాబ్‌లో అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేయమని తెలిపారు. వన్ నేషన్ వన్ రేషన్ అన్న నినాదం ఎత్తుకున్న కేంద్రం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ఎందుకు తీసుకురాదని ప్రశ్నించారు.