Siddipeta News: కుర్రో.. కుర్రు.. సోది చెబుతానమ్మ సోది.. జరిగింది జరిగినట్టు చెబుతాం, జరిగేది చెబుతాం, జరగోబేది చెబుతానే తల్లి. నీ మనసులో ఏమున్నాదో, నీవేం చేయాలనుకుంటున్నావో అంతా చెబుతాను.. అంటూ సిద్దిపేట జిల్లా నాంచారుపల్లికి చెందిన మైత్రి అనే ఓ విద్యార్థిని మంత్రి హరీష్ రావుకు జోస్యం చెప్పింది. కాబోయే పీఎం కేసీఆర్ అని సీఎం మీరేనంటూ వివరించింది. ఇది విన్న మంత్రి సహా నాయకులంతా సంతోషంగా నవ్వుకున్నారు. అంతేకాదండోయ్ మంత్రి హరీష్ రావు పుట్టుపూర్వోత్తరాలు, కేసీఆర్ తో సాన్నిహిత్యం, తెలంగాణ ఉద్యమంలో పాత్ర, సిద్దిపేట అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మామం, వైద్యారోగ్య శాఖ బలోపేతం తదితర విషయాల్లో ఆయన శ్రమను కళ్లకు కట్టినట్లు సోది రూపంలో వివరించింది. దాదాపు పదిహేను నిమిషాల పాటు గుక్కతిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. బహిరంగ సభలో మంత్రి ముందు కూర్చొని.. ఇంత చక్కగా విద్యార్థిని సోది చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సోదంతా అక్కడకి వచ్చిన ప్రజలంతా చాలా ఆసక్తి వినడం గమనార్హం.