Half Marathon at Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో థర్డ్ ఎడిషన్ హాఫ్ మారథాన్ పరుగు పోటీలను నిర్వహించారు. ఈ హాఫ్ మారథాన్ పరుగు పోటీలను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు పోటీల్లో 2,500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఇందులో 5కే, 10కే, 21కే పరుగు పోటీలు నిర్వహించగా ఈ పోటీల్లో సిపి శ్వేతా రెడ్డి 21 కిలోమీటర్ల పరుగు పోటీలో పాల్గొని పరుగును పూర్తి చేశారు. 


నాగర్ కర్నూల్ జిల్లా, రాజమండ్రి నుండి వచ్చిన యువకులు 21 కే లో విజయం సాధించారు. విజయం సాధించిన క్రీడాకారులకు ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత బహుమతులను ప్రధానం చేశారు. ఇలాంటి పరుగు పోటీలు శారీరిక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మారుమూల ప్రాంతమైన హుస్నాబాద్ లో మూడోసారి హాఫ్ మారథాన్ ను నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖ వారిని అభినందించారు. 


మానవ శరీరం ఎంత కదిలితే అంత ఆరోగ్యంగా ఉంటుందని సిపి శ్వేత అన్నారు. రోజు పరుగు చేయడం అలవాటు చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం పడదని, పరుగు మాత్రమే కాకుండా ఇతర క్రీడల్లో పాల్గొనడం కూడా శారీర ఆరోగ్యానికి దోహద పడుతుందన్నారు. పరుగు పోటీల్లో గెలుపొందిన విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు. కేవలం పతకాలు, విజేతలను నిర్ణయించడం కోసం పరుగు పందెం నిర్వహించలేదని, కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనందిస్తున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. మానసికంగా కూడా రోజంతా చురుగ్గా ఉండేలా చూస్తుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు ముందుకు మాత్రమే నడుస్తారు అంతా. కానీ రోజులో పావుగంటసేపు వెనక్కి నడవడం వల్ల అంటే బ్యాక్ వాకింగ్ చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వెనక్కి వాకింగ్ చేయడం ఏంటి అని అనుకోవద్దు, ముందుకు వేసే అడుగులనే వెనక్కి వేయాలి. ఈ బ్యాక్ వాకింగ్ అనేది ఇంట్లోనే చేసుకుంటే మంచిది. ఇంట్లోనే ఓ పావుగంటసేపు బ్యాక్ వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రెండు మూడు సార్లు జాగింగ్ చేసిన దాంతో సమానం. 


ముందుకి నడవడం కన్నా వెనక్కి నడవడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగిపోతాయి. దీనివల్ల కొవ్వు కరుగుతుంది కాబట్టి అధిక బరువు తగ్గడం సులువుగా మారుతుంది. వెనక్కి నడవడం కాస్త కష్టమే కానీ, ఇలా నడవడం వల్ల శరీరం బ్యాలెన్స్ ను మరింతగా పొందుతుంది. స్థిరంగా కూడా ఉంటుంది. వెనక్కి వాకింగ్ చేయడం వల్ల మీలో జాగ్రత్త, అప్రమత్తత పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పుడూ ముందుకు నడుస్తుండడం వల్ల కీళ్లు, కండరాలు దానికే అలవాటు పడతాయి. కానీ వెనక్కి నడవడం వల్ల వాటిలో కాస్త మార్పులు వచ్చి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ముందుకి నడవడం కన్నా, వెనక్కి నడవడం వల్ల శక్తి 40 శాతం అధికంగా ఖర్చవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.