ఈ ఫోటోలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎవరో మిలియనీర్ తాను సంపాదించిన డబ్బులతో ఒక పెద్ద రాజభవాన్ని నిర్మించుకున్నట్టుగా ఉంది కదూ? ఇంకా అందులో ఉన్న హాల్, ఇతర సౌకర్యాలు చూస్తే ఏదో ప్రైవేట్ సాఫ్ట్ వేర్ కంపెనీ అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ... కానీ అవేవీ నిజం కాదు ప్రముఖ తెలుగు సినీ కవి, కీర్తిశేషులు సి.నారాయణ రెడ్డి పేరు మీద సిరిసిల్లలో అత్యాధునిక హంగులతో నిర్మించిన లైబ్రరీ ఇది.
ఒక మంచి పుస్తకం 100 మంది ఫ్రెండ్స్ కి సమానం ఇలా పుస్తకాల గురించి మనం ఎన్నో సూక్తులు వింటుంటాం. అలాంటి పుస్తకాలు కొలువై ఉండే గ్రంథాలయం ఒక దేవాలయం తో సమానం అంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో ఒక ప్యాలెస్ ను తలపించేలా గ్రంధాలయాన్ని నిర్మించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ మోడరన్ లైబ్రరీ ఉంది. ఈ ఆధునిక హంగులతో మూడంతస్తుల భవనం నిర్మించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ భవనాన్ని మూడు కోట్ల 50 లక్షలతో ఒక సంవత్సరంలోనే పూర్తి చేశారు. సిరిసిల్లలో ఐకాన్ గా నిలుస్తున్న ఈ భవనం ఇది.
మూడంతస్తుల భవనం
కింది అంతస్తులో మూడు రీడింగ్ గదులు ఉన్నాయి. మొదటి అంతస్తులో, ఛైర్మన్, కార్యదర్శి రూములతో పాటు విశాలమైన మీటింగ్ హాల్ టాస్క్ శిక్షణ సంస్థ క్లాస్ రూమ్ లో ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల కోసం గదులు కంప్యూటర్ శిక్షణ కొరకు ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఆశాదీపంగా నిలుస్తోంది ఈ పుస్తక నిలయం. సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలోని టాస్క్ కేంద్రాన్ని నెలకొల్పి నైపుణ్యాలతో పాటు విజ్ఞానాన్ని పంచుతూ యువతను విజయతీరాలకు చేర్చుతోంది.
టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా
సిరిసిల్ల సినారె సరస్వతి మందిరం ఈ సినారె సరస్వతి మందిరం సిరిసిల్లకే కొత్తగా ఆకర్షణ తెచ్చిపెట్టింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికే కాకుండా మరికొన్ని ఉపాధి అవకాశాలను అందుకునే నైపుణ్యాలను పెంపొందించుకోటానికి ఒక చక్కని ప్రదేశం. సి నారాయణరెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన ఈ మందిరం ఇప్పుడు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గ నిర్దేశంగా నిలుస్తోంది. ఉచితంగా సాఫ్ట్ వేర్ కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ చొరవతో సినారే మందిరంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశారు. టాస్క్ ద్వారా యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం శిక్షణ కూడా ఇస్తున్నారు. C, C++, JAVA, Python, Oracle ఇలాంటి మరికొన్ని సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
25 కంప్యూటర్లు 40,000 పుస్తకాలను లైబ్రరీలో సమకూర్చారు. పర్యవేక్షకులను ఏర్పాటు చేయడం ద్వారా యువతి ఉపాధి మార్గాలు అవసరాలు తీరనున్నాయి. డిజిటల్ లైబ్రరీ కూడా కావడంతో స్థానికంగా వివిధ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఇక్కడ మంచి శిక్షణ అందుతుంది. రోజుకు 400కు పైగా విద్యార్థులు సినారే మందిరానికి వస్తున్నారు. గ్రూప్స్ బ్యాంక్ జాబ్స్ రైల్వే ఇతర రంగాల జాబ్స్ కోసం చూసేవారికి నాలెడ్జ్ షాప్ గా కూడా జిల్లా గ్రంథాలయం నిలుస్తుంది. పోటీ పరీక్షలకు ప్రైవేటుగా శిక్షణ పొందాలంటే వేళల్లో ఖర్చు పెట్టాలి. కానీ ఎటువంటి ఫీజు లేకుండా యువతకు శిక్షణ అందిస్తుంది. సినారే మందిరం టాస్క్ ద్వారా ఒక్కో బ్యాచ్ లో 40 నుండి 50 మంది విద్యార్థులతో ట్రైనింగ్ సాగుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సినారేస్ మారక గ్రంథాలయం తెరిచి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల యువత, నిరుద్యోగులు, నిరుపేద యువతి యువకులు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకర్ కోరారు.