Fire Accident: పెద్దపల్లిలో భారీ అగ్ని ప్రమాదం - కియా కారులో మంటలు చెలరేగి 3 కార్లు దగ్దం

మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య ఫాం హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కియా కారులో మంటలు చెలరేగి మొత్తం 2 కార్లు దగ్దమయ్యాయి.

Continues below advertisement

పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య ఫాం హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కియా కారులో సెంటర్ లాక్ వేస్తుండగా భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. కారు పక్కనే పార్క్ చేసిన ఇన్నోవా, క్రేటా కార్లు అగ్నికి బుగ్గి అయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మూడు కార్లు దగ్ధమైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజయ్యకు చెందిన కియా కారు సెంట్రల్ లాక్ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి.

Continues below advertisement

ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో పక్కనే ఉన్న మరో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అక‌స్మాత్తుగా చెలరేగిన మంటల్లో కియా, ఇన్నోవా, క్రేట కార్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. రాజయ్య ఫామ్ హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Continues below advertisement