Viral News: అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళ ప్రైవేట్ వీడియో కాల్, తరువాత ఏం జరిగిందంటే!

Woman Private Video Call to MLA | కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ రావడం కలకలం రేపుతోంది. తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

కరీంనగర్: ఓవైపు సైబర్ క్రైమ్స్, మరోవైపు లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోలతో బెదిరింపుల ఘటనకు పెరిగిపోతున్నాయి. అయితే అశ్లీల వీడియోలతో సామాన్యులను మాత్రమే కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలను సైతం టార్గెట్ చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఆ వీడియోలు లీకై ప్రభుత్వాలకు సైతం సెగ తగిలిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేలకు అర్థరాత్రి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అర్ధరాత్రి ఎమ్మెల్యేకు ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ చేయడం కలకలం రేపుతోంది.
అర్ధరాత్రి నగ్నంగా మహిళ వీడియో కాల్..
వీలు చిక్కితే చాలు ఫోన్లకు మెస్సేజ్ లు పంపి ఓటీపీ షేర్ చేయగానే వేలల్లో, లక్షల్లో, వీలైతే కోట్లల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. అలాంటిది ఓ మహిళ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. అక్టోబర్ 14న అర్ధరాత్రి వీడియో కాల్ రాగా, ఎమ్మెల్యే లిఫ్ట్ చేశారు. కానీ అక్కడ కనిపించిన సీన్ చూసి ఎమ్మెల్యేకు గుండె పగిలినంత పనైంది. వీడియో కాల్ ఆన్ చేయగానే అవతలివైపు ఉన్న మహిళ నగ్నంగా కనిపించింది. దాంతో ఎమ్మెల్యే ఆ వీడియో కాల్ కట్ చేశారు. 

Continues below advertisement

ఎమ్మెల్యేను ఇరికించాలనే ఇలా చేశారా?

ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే తనకు మహిళతో ఇలా అశ్లీల వీడియో కాల్ చేపించారా లేక మహిళనే కావాలని ఇలా చేసిందా అని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ వీడియో కాల్ రికార్డ్ చేసి తనపై ఏదైనా కుట్ర చేసే అవకాశం భావించిన ఎమ్మెల్యే సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనను కావాలనే ఇలాంటి వాటిలో ఇరికించి, పరువు, ప్రతిష్టలను దెబ్బతీయాలనే కుట్ర జరిగిందని ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Also Read: Crime News: కోడలిపై మామ అత్యాచారయత్నం - ప్రతిఘటించడంతో బండరాయితో కొట్టి చంపేశాడు, ఎక్కడంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola