Man Killed His Daughter In Law In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) దారుణం జరిగింది. కొందరు మృగాళ్లు మానవత్వం మరిచిపోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా తన కోడలి పట్ల వ్యవహరించి దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరు మండలం నాగటూరులో ఓ మహిళ తన పొలంలో పని చేసుకోవడానికి ఎప్పటిలాగే వెళ్లింది. ఈ క్రమంలోనే మొక్కజొన్న కంకులు ఏరడానికి వచ్చిన మామ కురుమన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో మామ కురుమన్న ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న బండరాయితో కోడలిని కొట్టి చంపేశాడు. బండరాయితో దాడి చేయడంతో ఆమె ముఖం నుజ్జునుజ్జై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: ఏపీలో తీవ్ర విషాదాలు - రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య, మరో చోట అమ్మనాన్నలను విడిచి ఉండలేక బాలిక సూసైడ్