Minister KTR: తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్లి తమకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా ఓటర్లకు చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఆకట్టుుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, ప్రముఖ యూట్యూబర్లు ‘మై విలేజ్ షో’ బృందంతో కలిసి వంట చేశారు. 


దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూట్యూబ్‌కు ప్రత్యేకంగగా పరిచయం అవసరం లేదు. పల్లెటూరి రుచులను, అనుబంధాల మీద వీడియోలు చేసి ఎంటర్‌టైన్ చేస్తుంటారు.చిన్న చిన్న వీడియోలతో ప్రారంభమైన ఈ ఛానల్‌ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్‌కు ఎదిగింది. ఇందులో గంగవ్వ బాగా ఫేమస్ కావగా, అనిల్, అంజిమామ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు.


‘మై విలేజ్‌ షో’లో గంగవ్వ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది. గంగవ్వ ఇప్పటికే సమంతతో పాటు, చాలా మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది. తాజాగా.. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్‌ టీంతో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. పంట పొలాల మధ్యలో నాటు కోడి కూర వండుతూ సరదగా గడిపారు. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గంగవ్వతో టీమ్‌తో బగారా రైస్‌తో పాటు నాటు కోడి కూర కూడా వండి తినేశారు. 


వీడియోలో మై విలేజ్ షో టీం అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తన కుటుంబ వివరాలు పంచుకున్నారు. చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తనకు ఈత రాదని చెప్పుకొచ్చారు. తనది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత తనకుంటే మూడేళ్లు చిన్నదని అన్నారు. రాఖీ పండుగ రోజు కవితకు చీర పెట్టినట్లు చెప్పారు. తనకు ఇద్దరు బావమరుదులు ఉన్నారని, తనను బాగా చూసుకుంటారని తెలిపారు. గంగవ్వ కుటుంబానికి ఎంత భూమి  ఉందని అడిగారు. రైతు బంధు పడుతుందా లేదని ఆరా తీశారు. తనకు రైతు బంధు వస్తుందని గంగవ్వ చెప్పారు. 


సిరిసిల్లలో తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి ఒక్క చుక్క మందు పోయలేదని, ఒక్క నోటు పంచలేదన్నారు. కానీ ప్రజలు తనను గెలిపించారని అన్నారు. మంచి చేస్తామని నమ్మకం ప్రజలకు కల్పించగలిగితే ప్రజలు అక్కున చేర్చుకుంటారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మరో సారి వస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని అన్నారు. తనకదానికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు. నెట్టింట ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. 


మంత్రి వెరైటీగా ప్రచారం చేయడంతో ఆయన్న చాలా మంది అభినందిస్తున్నారు. సాంకేతికతను, సోషల్ మీడియా, ట్రెండిగ్‌లో ఉన్న విషయాలను ఉపయోగించుకోవడంలో మంత్రి కేటీఆర్‌ను మించినోడు లేడని కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, ప్రతిపక్షాల తీరుపై అధికార పక్షం విమర్శలు చేస్తోంది.