Harish Rao: కేసీఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం మీటర్ పెట్టడు, నిర్మల వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్

ABP Desam   |  21 Nov 2023 07:07 PM (IST)

Nirmala Sitharaman వ్యాఖ్యలపై హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అన్నడని హరీశ్ రావు గుర్తు చేశారు.

హరీష్ రావు

Harish Rao on Nirmala Sitharaman: తెలంగాణ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టే అంశంపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హుస్నాబాద్ లో మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అన్నడని హరీశ్ రావు గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ అసలు ఉన్న విషయాన్ని బయటపెట్టారని అన్నారు. దీంతో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు క్లియర్ గా నిర్మలా సీతారామన్ చెప్పారని చెప్పారు. మోటార్లకు మీటర్లు అని బీజేపీ, మూడు గంటలు కరెంటు అని కాంగ్రెస్ అంటున్నదని.. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

కేసీఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అన్నడు. నిర్మలా సీతారామన్ ఉన్నది బయటపెట్టారు. బీజేపీకి ఒక్క సీటు కూడా ఇగరదు. తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు. మోటార్లకు మీటర్లు అని బీజేపీ, మూడు గంటలు అని కాంగ్రెస్ అంటున్నది. ప్రజలు ఎటువైపు ఉంటారు తేల్చుకోవాలి-

‘‘కరీంనగర్ లో గెలవలేని కాంగ్రెస్ వ్యక్తి ఇక్కడ ఎలా గెలుస్తారు. ఎమ్మెల్యే సతీష్ అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. కోర్టుల్లో కేసులు వేసి గౌరవెళ్ళి ప్రాజెక్ట్ జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. సతీష్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. మీ అందరి కోరిక మేరకు అక్కన్నపేట మండలం దత్తత తీసుకుంటా.. ఒక్క ఓటు అయినా మండలాల కంటే ఎక్కువ తేవాలి’’ అని హరీశ్ రావు అన్నారు.

మీటర్లు పెట్టనందుకే డబ్బులు ఇవ్వలేదు - నిర్మలా సీతారామన్

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు నిరాకరించడం పట్ల నిర్మల సీతారామన్ స్పందించారు. ఆ విషయం నిజమేనని అన్నారు. అందుకే కేంద్రం నుంచి ఇవ్వాల్సిన సొమ్మును తెలంగాణకు ఇవ్వలేదని చెప్పారు. మిగతా రాష్ట్రాలు బోర్లకు మీటర్లు ఫిక్స్ చేసి తమకు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను తీసుకున్నారని అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (నవంబర్ 21) హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ లోని ముగ్ధ బాంకెట్ హాల్ లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘వేల కోట్ల పెట్టుబడి పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పనికి రాకుండా పోయింది. కుటుంబ పార్టీ పాలనలోనూ.. నిధులు సద్వినియోగ పరుచుకోవడంలోనూ విఫలమైంది. నవంబర్ 30న జరగబోయే ఎలక్షన్స్ తెలంగాణకు చాలా ముఖ్యమైనవి. ఈ ఎన్నికల ప్రాముఖ్యతను ప్రజలకు తెలపాలి. కోవిడ్ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా.. భవిష్యత్ లో రాష్ట్రాలపై భారం పడకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.  

Published at: 21 Nov 2023 07:03 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.