Balka Suman: బాల్క సుమన్‌కు నోటీసులు, సీఎం రేవంత్‌ను తిట్టిన కేసులో ఇచ్చిన పోలీసులు

Balka Suman News: ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.

Continues below advertisement

Police Notices to Balka Suman: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు అందించారు. గత వారం రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఅర్ఏస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకుల పిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు 294B, 504, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. 

Continues below advertisement

ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసు నమోదు చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ తమదని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. బాల్క సుమన్ ఎక్స్ ద్వారా స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నామీద మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు. ఆ కేసులో భాగంగా ఈరోజు మంచిర్యాల ఎస్సై కేసులకు సంబందించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని  పోరాటం చేసిన పార్టీ మాది, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని బాల్క సుమన్ పోస్ట్ చేశారు.

Continues below advertisement