Harish Rao Emotional Video: సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. ఓ చిన్నారి తన గురించి చెబుతూ ఏడవడం చూసి తను కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారుతోంది. 

లీడ్ ఇండియా ఆధ్వర్యంలో సిద్ధిపేటలో భద్రంగా ఉండాలి, భవిష్యత్‌లో ఎదగాలి అనే కార్యక్రమంం చేపట్టారు. చిన్నారులు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి అనే కాన్సెప్టుతో దీన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు తమకు ఎదురైన అనుభవాలను వేదికపై పంచుకున్నారు. తాము ఎలా రియలైజ్ అయ్యారో కూడా తెలిపారు. 

ఈ సందర్భంగా ఓ చిన్నారి చేసిన ప్రసంగం అందర్నీ కదిలించింది. మాజీ మంత్రి హరీష్‌రావు సహా అక్కడకు వచ్చిన వారందరితో కన్నీళ్లు పెట్టించింది. చిన్నప్పుడేతన తండ్రి కిడ్నా వ్యాధితో చనిపోయాడని చెప్పిందా చిన్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని ప్రసంగాన్ని మొదలు పెట్టింది. తల్లి గురించి చెబుతూ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. 

తండ్రి చనిపోయినప్పటి నుంచి అన్నీ తానై తనను తల్లే పెంచి పోషించిందని చెప్పుకొచ్చిందా చిన్నారి. తను కూడా చాలా సార్లు అమ్మను కష్టపెట్టానని ఏడుస్తూ చెప్పింది. ఇకపై ఎప్పుడూ తనను ఇబ్బంది పెట్టనని గుక్కపెట్టి ఏడ్చేసింది. 

ఆ పాప చేసిన ప్రసంగం విన్న అంతమంది ఏడ్చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఆ పాపను దగ్గరికి తీసుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కళ్ల నుంచి వస్తున్న నీటిని తుడుకుంటూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. 

అనంతరం పిల్లలను ఉద్దేశించి మాట్లాడిన హరీష్‌రావు... మన శ్రేయస్సు కోరుకునే వాళ్లు తల్లిదండ్రులే అన్నారు. మన మంచిని ఎప్పుడూ ఆకాంక్షించే తల్లిదండ్రుల మాట వినాలని చిన్నారులకు సూచించారు. వారు చెప్పినట్టు నడుచుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని సురక్షితంగా ఉంటారని చెప్పుకొచ్చారు. చిన్నారులు మొబైల్‌ గేమ్స్ ఆడొద్దని గ్రౌండ్‌లో ఆడుకోవాలని సూచించారు. ఇంటి ఫుడ్‌కు ఎక్కువ ప్రయార్టీ ఇవ్వాలని జంక్‌ఫుడ్‌ తినొద్దని హితవుపలికారు. మాతృభాషను మర్చిపోవద్దని రోజూ తెలుగు చదువుతూ ఉండాలని చెప్పారు. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు సహాయం చేయాలని హితవుపలికారు. బాగా చదివి తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి, ఉపాధ్యాయుల మంచి పేరు తీసుకురావాలని చిన్నారులకు సూచించారు.  ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని, ఎంత మంది ఉన్నా ధైర్యంగా మాట్లాడాలని వారికి తెలియజేశారు.