Trains Canceled in Telangana:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు ముంపు బారిన పడ్డాయి. వరదల ధాటికి రహదారులు, రైల్వేట్రాక్‌లు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన రైల్వే శాఖ తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా వెళ్లే ట్రైన్స్‌ను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ వివరాలు ఇక్కడ చూడొచ్చు.
రద్దు అయ్యిన ట్రైన్స్
కరీంనగర్౦ కాచిగూడ, కాచిగూడ-నిజామాబా్, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి, నిజామాబాద్-కాచిగూడ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దు అయ్యిన ట్రైన్స్
మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ,
దారి మళ్లించిన రైళ్లు ఇవే
- రాయచూర్- పర్భాని ట్రైన్‌ను వికారాబాద్- పార్లీ వైజంత్- పూర్ణ మీదుగా దారి మళ్లించారు.
- నాందేడ్- రాయచూర్ ట్రైన్‌ను నాందేడ్-పూర్ణ-పర్లీ వైజంత్- వికారాబాద్ మీదుగా దారి మళ్లించారు.
- బికనీర్- కాచిగూడ ట్రైన్‌ను పూర్ణ-పర్భాని౦ పర్లీ వైజంత్- వికారాబాద్- సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు.
- హిసార్- హైదరాబాద్ ట్రైన్‌ను పర్భాని-పర్లీ వైజంత్- వికారాబాద్-హుస్సేన్ సాగర్ జంక్షన్- హైదరాబాద్ డెక్కన్ మీదుగా మళ్లించారు.
- మన్మాడ్-కాచిగూడ అజంతా ఎక్స్‌ప్రెస్‌ను పర్భానీ- పర్లీ వైజంత్- వికారాబాద్- సికింద్రాబాద్‌మీదుగా దారి మళ్లించారు.
రీషెడ్యూల్ చేసిన ట్రైన్స్
- లింగంపల్లి-కాకినాడ పోర్ట్ గౌతమి ఎక్స్‌ప్రెస్
- కాచిగూడ- భాగత్‌కి కోఠీ ట్రైన్‌ను రీ షెడ్యూల్ చేశారు.
పూర్తి వివరాలకు ఫోన్ చేయాల్సిన నెంబర్లు ఇవే-
9063318082(కాచిగూడ )
970329671(నిజామాబాద్ )
9281035664(కామారెడ్డి )
040-277 86170(సికింద్రాబాద్ )