Karimnagar Chicken Price: తెలంగాణలో కోడి కొండెక్కి కూర్చుంది. మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. కోడి మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కిలో రూ.280 నుంచి రూ.300 దాటిపోవడంతో సామాన్యుడు చికెన్ ముక్క తినాలంటేనే జంకుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధరలు ఆకాశం వైపు పరుగులు పెడుతుండడంతో చికెన్ కొనే పరిస్థితి లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చికెన్.. ఈ మాట అంటేనే సామాన్యులు భయపడుతున్నారు. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో మాంసం ప్రియులు చికెన్ వైపు చూడాలంటేనే జంకుతున్నారు. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఫిబ్రవరి మార్చి నెలల్లో చికెన్ ధర రూ.150 నుండి రూ.200 వరకు పలకగా ప్రస్తుతం మాత్రం రూ.300 కు చేరుకుంది. దీంతో చికెన్ ధరలు చూసి చికెన్ ముక్క తినాలంటే సామాన్యులు జంకుతున్నారు.


అటు తెలంగాణ రాష్ట్రంలో చికెన్ రేట్లు మండిపోతున్నాయి. ఒకప్పుడు వేసవి కాలం వస్తే చికెన్ ధరలు తగ్గేవి కానీ ఇప్పుడు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈసారి రికార్డు స్థాయికి చేరుకొని కరీంనగర్ లో ప్రస్తుతం రూ.300 నుంచి రూ.320 వరకు ఉన్నాయి. అయితే ఎండాకాలంలో వేడి చేస్తుందనే కారణంతో చికెన్ తినేందుకు కొందరు ఇష్టపడరు. మరోవైపు ఈ ఎండల దెబ్బకి కోళ్లు పిట్టలు రాలిపోతున్నట్లు రాలిపోతుండడంతో ఉత్పత్తిని కూడా తగ్గిస్తారు. ఈ విషయాన్ని పౌల్ట్రీ ఫాం నిర్వహకులు వెల్లడించారు.