BJP MLA Etela Rajender Road Accident:
కరీంనగర్ జిల్లా :- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మెన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటెల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గొర్రెలు అడ్డురావడంతో ముందు వెళ్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఈటెల ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈటల క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.