BJP gives complaint against Ponnam Prabhakar- కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ బిజెపి సీనియర్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.  హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేలా మాట్లాడినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తున్నమంత్రి  పొన్నంపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


మంత్రి పొన్నంపై బీజేపీ ఫిర్యాదు


ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ RTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రచార సభలలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై అసందర్భ, నిరాధార అనుచిత వ్యాఖ్యలు చేశారని కరీంగనర్ బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సమాధి చేస్తామంటూ వ్యక్తిగత దూషణలతో అవమానకర పదజాలంతో పొన్నం ప్రభాకర్ ప్రసంగాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలతో శ్రీరాముని ఫోటోలు పంచుతున్నారని ఆరోపిస్తూ.. శ్రీరాముడి పేరును వాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడని చెప్పారు. గతంలో కార్పొరేటర్ గా ఉన్న సమయంలో సానిటేషన్ కార్మికుల వద్ద డబ్బులు తీసుకున్నారంటూ బండి సంజయ్ పై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసి, ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారని ఈసీకి తెలిపారు. ఎన్నికల నియమావళి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ పై ఎన్నికలు ముగిసే వరకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, ప్రసంగాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కొట్టె మురళీకృష్ణ కోరారు. పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లు, ఆరోపణలకు సంబంధించి వీడియోల కాపీని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు లేఖలో పంపించారు.  పంపనైనది.