Kalvakuntla Kavitha rowdy type: బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్న వారికి కల్వకుంట్ల కవిత హెచ్చరికలు జారీ చేశారు. తాను కేసీఆర్ అంత మంచి వ్యక్తిని కాదని... కాస్త రౌడీ టైప్ అన్నారు. వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ కోసం జనసమీకరణ సమావేశాలను కవిత నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు.
బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు ..కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేసీఆర్ మంచోడనేనని తానే కాస్త రౌడీ టైప్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరని హెచ్చరించారు.
కవిత పార్టీ నేతలపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులపై తరచుగా స్పందిస్తున్నారు. తాను పింక్ బుక్ నిర్వహిస్తున్నానని అందులో పేర్లు రాసుకుంటున్నానని అంటున్నారు. ఈ క్రమంలో తాను రౌడీ టైప్ అని బెదిరించడం వైరల్ గా మారుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతను కవిత తీసుకున్నారు. పార్టీ సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ లో నిర్వహిస్తున్న బహిరంగసభకు పెద్ద ఎత్తున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రజల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ముఖ్యంగా కవిత బాధ్యత తీసుకుని రెండు సార్లు గెలిపించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు.. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్ గా కూడా వ్యవహిరంచిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పార్టీ మారకుండా చూసి.. పార్టీని బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. లాంటి చోట్ల పార్టీ నేతలకు వేధింపులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఆమె .. హెచ్చరకలు ఇస్తున్నారు. పింక్ బుక్ లో రాసుకుంటానని వదిలేది లేదని అంటున్నారు. గతంలో పింక్ గురించి చెప్పారు కాను తాను రౌడీ టైప్ లాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అవి వైరల్ గా మారుతున్నాయి.