Ka Paul :  ప్రజాశాంతి పార్టీ ఇనాక్టివ్ కావడంతో  పోటీలో ఉండటం లేదు.  ప్రజాశాంతి పార్టీ ( Prajashanti party  ) పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. డోంట్ ఓట్ లేదా ఓట్ నోటా ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్తానని మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్, గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామన్నాని అన్నారు. పార్టీని ఇనాక్టివ్ నుంచి అక్టీవ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్  ( Election Commision )  సంవత్సరం కింద లెటర్ ఇచ్చిందని, మరి ఇప్పుడు ఎందుకు అక్టీవ్ చేయలేదని ప్రశ్నించారు.  అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


సీఈఓ వికాస్ రాజ్  ( Vikas Raj ) , డిప్యూటీ సీఈఓ సత్యవాణి తమ ఉద్యోగాలు పోయినా పర్లేదని నిజాలు చెప్పారని అన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు వస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లదాక్ ఎన్నికలు రద్దు చేశారని, తన పార్టీకి సింబల్ అండ్ ఇనాక్టివ్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నామని తెలిపారు. ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని లద్ధాఖ్ ఎన్నికలు రద్దు చేశారని.. ఈ క్రమంలోనే తన పార్టీకి సింబల్ అండ్ ఇనాక్టివ్ చేసినందుకు కోర్టులో పిటిషన్ వేస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. డోంట్ ఓట్ లేదా ఓట్ నోటా ట్యాగ్‌తో ప్రజల్లోకి వెళ్తామన్నారు. 


అంబేడ్కర్‌ అండ్ గద్దర్ ఆశయాలను నెరవేర్చుకుందామని ప్రజలకు సూచించారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేదు కాబట్టి ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కోరారు. మంద కృష్ణ మాదిగకు మోడీ కోట్లు ఇచ్చి సభ పెట్టించారని ఈ సందర్భంగా ఆరోపణ చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మునుగోడు ఉపఎన్నికల్లో స్వయంగా పోటీ చేశారు కేఏ పాల్. తర్వాత  ఎన్నికల సంఘం దగ్గర పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంలో విపలమయ్యారు. ఐదు రోజుల కిందట  12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఆ  విడుదల చేశారు. తమ పార్టీ తరపున తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అయితే ఆయన పార్టీకి అసలు పోటీ చేసే అర్హత లేకపోడంతో చివరికి ఆ బీఫాంలన్నీ వృధా అయ్యాయి. 


అమెరికాలో మత ప్రచారకునిగా, శాంతి దూతగా ఉన్న కేఏ పాల్ .. తన పీస్ మిషన్ కు అనుమతులు ఇవ్వకపోవడంతో వందల కోట్ల డాలర్లు విరాళాలు ఆగిపోయాయని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కువగా ఏపీలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేశారు. ఇటీవల తెలంగాణలోనే రాజకయం చేస్తానని తిరిగారు. కానీ ఓ సారి గత ఏడాది మేలో  రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళుతుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర ఓ యువకుడు దాడి చేశారు.  కేఏ పాల్ ను చంపదెబ్బ కొట్టాడు. అప్పట్నుంచి తెలంగాణలో రాజకీయం తగ్గించుకున్నారు.