NTR To NTR :   ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా  లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది.  ఎన్.టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేసే అవకాశం ఉంది.  ఈ సందర్భంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ను ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్ల పై వారు చర్చించారు.                                                     


మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయింది.  మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు.                                           


రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. హైద‌రాబాద్ హుస్సేన్‌సాగ‌ర్ మ‌ధ్య‌లో బుద్దుని విగ్ర‌హం మాదిరే.. ఖ‌మ్మం ల‌కారం ట్యాంక్‌బండ్‌పై శ్రీకృష్ణుడి రూపంలో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. బేస్‌మెంట్‌తో క‌లిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా.. 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​పై అమర్చనున్నారు.                                  
 
హైద‌రాబాద్ హుస్సేన్‌సాగ‌ర్ మ‌ధ్య‌లో బుద్దుని విగ్ర‌హం మాదిరే.. ఖ‌మ్మం ల‌కారం ట్యాంక్‌బండ్‌పై శ్రీకృష్ణుడి రూపంలో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. బేస్‌మెంట్‌తో క‌లిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా.. 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​పై అమర్చనున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహంతో ఖమ్మం నగరానికి ఓ పర్యాటకంగా మరింత గుర్తింపు రాబోతోంది.