Hyderbad IT Raids :  హైదరాబాద్‌లో ఒకే సారి యాభైకి పైగా ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.   తెల్లాపూర్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.  రాజ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐదు బృందాలుగా విడిపోయిన  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఇంటితో పాటు  మొత్తం 50 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుపుతున్నారు.   వసుధ ఫార్మా, రాజు పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో అధికారులు ఆడిట్లను పరిశీలిస్తున్నారు. గత   ఐదేళ్లు ఐటీ రిటర్న్స్ పై విచారిస్తున్నారు.  భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.


సోదాలు నిర్వహిస్తున్న యాభైకి పైగా బృందాలు


మాదాపూర్, ఎస్సార్ నగర్, జీడిమెట్ల లోని కంపెనీ కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 50 కి పైగా బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. వసుధ గ్రూప్ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఇళ్లల్లో కూడా ఐటి దాడులు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకటరామ రాజు ఇంట్లోనూ, కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మా తో పాటు చైర్మన్ వెంకట రామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. 


కలెక్టర్ గా ఉన్న వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ తీసుకోగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ 


ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి గతంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉండేవారు. ఆయన  వీఆర్ఎస్ తీసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులు మొదటి నుంచి రాజపుష్ప అనే రియల్ ఎస్టేట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ పెద్ద ఎత్తున హైరైజ్ అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థపైనా దాడులు జరగడం అధికార పార్టీలోనూ కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో ఐటీ అధికారులు తెలంగాణలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలు, ఇళ్లపైనా సోదాలు చేశారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. 


వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అవకతవకలు


తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఐటీ దాడులు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రారంభమైన రాజకీయ సమరం కారణంగా తమ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఐటీ దాడుల్లో రాజకీయ ప్రమేయం ఏమీ ఉండదని... రాజకీయ నేతలు అయినంత మాత్రాన పన్నులు ఎగ్గొడితే సోదాలు చేయకూడదా అన్న వాదన బీజేపీ నేతల నుంచి వస్తోంది. ఈ సోదాల్లో ఎంత మేర బ్లాక్ మనీ దొరికిందనేది అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 


నెల్లూరు వైఎస్ఆర్‌సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !