Yellow Alert To Telangana Districts: తెలంగాణలో (Telangana) ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట సైతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు, ఆదివారం నుంచి వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.


ఈ జిల్లాల్లో వడగాల్పులు


ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటో తేదీన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ రెండో తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


రానున్న 2 రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు భద్రాచలం, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రోడ్డుపైకి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Also Read: RS Praveen Kumar: కానిస్టేబుల్ జాబ్స్‌కు ఎంపికైనా, వారికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు?- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్