Idupu Kayitham Controversy Explained: 'ఎక్స్' (ట్విట్టర్)లో ఫ్యాన్ వార్స్ కామన్. ఓ హీరో అభిమానులు మరో హీరోపై దుమ్మెత్తి పోయడం సజహంగా జరిగేది. డై హార్డ్ ఫ్యాన్ వార్స్ నెటిజనులు కొత్త కాదు. కానీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ... అంటూ మాటలతో 'ట్విట్టర్ వార్' చేస్తున్నారు. దీనికి 'ఇడుపు కాయితం' కారణమైంది. మధ్యలో రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ కూడా మంటపై ఆజ్యం పోసినట్టు అయ్యింది. అదెలా? అసలు ఏమిటీ గొడవ? వంటి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'ఇడుపు కాయితం'పై నెటిజన్ కామెంట్...ప్రాంతాల మధ్య గీత గీసిన మీనింగ్ ఇష్యూ!ప్రియదర్శి, నాగదుర్గ జంటగా 'ఇడుపు కాయితం' సినిమా మొదలైంది. మొదట ఆ పదానికి అర్థం ఏమిటి? అనేది చాలా మంది ప్రేక్షకులకు తెలియలేదు. తెలంగాణ నేపథ్యంలో 'ఇడుపు కాయితం' తెరకెక్కుతోంది. అయితే... తెలంగాణలో చాలా మంది ప్రేక్షకులకూ ఆ టైటిల్ మీనింగ్ తెలియదు. దాంతో సెర్చ్ చేశారు. ఆ టైటిల్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. మీనింగ్ తెలిశాక ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు సినిమాపై ఆసక్తి ఇంకొంచెం పెరిగింది. (ఇడుపు కాయితానికి ఇంకేం అర్థాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

'సార్... తెలుగులో డబ్ చేస్తారా? లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అయితం ఆంధ్రోళ్ళం' అంటూ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. అతడి ట్వీట్‌పై తెలంగాణ ప్రాంత ప్రజలు భగ్గుమన్నారు. తమ యాస, మాండలికాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని ట్వీట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవగా మార్చేశారు. ఈ మంటకు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఆజ్యం పోయినట్టు అయ్యింది. ఎందుకంటే... 

Continues below advertisement

ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు గుప్పిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు ఇష్యూను సైతం ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవగా కొందరు ప్రాజెక్ట్ చేయగా... పవన్ మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్ళలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఇప్పుడు 'ఇడుపు కాయితం'పై ఆయన ట్వీట్ చేయడం వివాదాన్ని పెద్దది చేసినట్లు అయ్యింది.

తెలంగాణ యాసకు సబ్ టైటిల్స్ కావాలా?ఆంధ్ర ప్రజలు తెలంగాణ సినిమాలు చూడలేరా?'ఇడుపు కాయితం' వివాదానికి కారణమైన ట్వీట్ ఏమిటి? ''తెలుగులో డబ్బింగ్ చేస్తారా? సబ్ టైటిల్స్ వేస్తే హ్యాపీగా ఆంధ్ర వాళ్ళం హ్యాపీగా ఫీల్ అవుతాం'' అని! నిజంగా తెలంగాణ మాండలికం, యాసలో తెరకెక్కుతున్న సినిమాలకు ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ లభించడం లేదా? తెలుగు చిత్రసీమలో ఆంధ్ర ప్రాంత పెద్దల నుంచి ప్రోత్సాహం లభించడం లేదా? అని ప్రశ్నించుకుంటే...

ఇడుపు కాయితానికి ముందూ తెలంగాణ నేపథ్యంలో సినిమాలు చేశారు ప్రియదర్శి. 'బలగం' సినిమా చూసి చిరంజీవి 'భోళా శంకర్' సెట్స్‌కు చిత్ర బృందాన్ని పిలిచి అభినందించారు చిరంజీవి. ప్రాంతాలకు అతీతంగా ఆ సినిమా ప్రశంసలు అందుకుంది. తెలంగాణ యాస, మాండలీకంపై ఎవరూ విమర్శలు చేయలేదు. అంత ఎందుకు? నాని హీరోగా నటించిన 'దసరా' కూడా తెలంగాణ నేపథ్యంలో చిత్రమే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది తెలంగాణ కావచ్చు. కానీ, హీరో నాని ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన సినిమా చేశారు. ప్రేక్షకులు ఆదరించారు. తెలంగాణ యాసకు సబ్ టైటిల్స్ కావాలని ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పైన చెప్పిన సినిమాలు సాధించిన విజయాలే అందుకు ఉదాహరణ.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

చిత్తూరు యాసలో తెరకెక్కిన 'పుష్ప', ఉత్తరాంధ్ర నేపథ్యంలో తీసిన 'పెద్ది'... ఆయా సినిమా విజయాలకు అడ్డు కాలేదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ... ఏ కథకు అయినా సరే యాస సొగసు అద్దుతుంది. అంతే తప్ప విజయాన్ని అడ్డుకోలేదు. అంత ఎందుకు... 'ఇడుపు కాయితం' నిర్మాతలలో ఒకరైన బన్నీ వాస్ (Bunny Vas)ది పాలకొల్లు. కథ నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు.

మలయాళ, తమిళ్ సినిమాలు చూడట్లేదా?సబ్ టైటిల్స్ వేస్తారా? అని నెటిజన్ చేసిన ట్వీట్ ముమ్మాటికీ తప్పే. తెలంగాణ యాసను ఆ విధంగా అగౌరవ పరిస్తే అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. మరో సందేహం అవసరం లేదు. కానీ, తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచిస్తారా? అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే సమాధానం వస్తుంది. 

సూర్య తమిళ్ హిట్ 'కరుప్పు'ను తెలుగులో 'వీరభద్రుడు'గా డబ్బింగ్ చేశారు. కార్తీ 'వా వాతియార్'కు తెలుగులో 'అన్నగారు వొస్తారు' అని టైటిల్ పెట్టారు. ఆ రెండు సినిమాలు మినహాయిస్తే కొంత మంది మలయాళ, తమిళ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు సేమ్ టైటిల్స్‌తో డబ్బింగ్ చేశారు. ఉదాహరణకు... సూపర్ స్టార్ రజనీకాంత్ 'వెట్టయాన్', మోహన్ లాల్ 'ఎల్ 2 ఎంపురాన్', టోవినో థామస్ 'పళ్లి చట్టంబి' సినిమాలు సేమ్ టైటిల్స్‌తో విడుదల అయ్యాయి. ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పేర్లతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళారు. కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' సినిమాను 'కొత్త లోక'గా డబ్ చేస్తే... ఆ సినిమా తెలుగులో భారీ వసూళ్ళు సాధించింది.

Also Read: Inder Kaur Death Mystery - కాలువలో సింగర్ డెడ్ బాడీ... ఎవరీ ఇందర్ కౌర్? మర్డర్ చేసిందెవరు?

భాషతో సంబంధం లేకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలను సబ్ టైటిల్స్‌తో ఏపీ, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో మలయాళ, తమిళ సినిమాలు ఆయా భాషల్లో విడుదల అవుతుంటే హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా భాషలు రాకున్నా సబ్ టైటిల్స్ ఉంటే చూస్తున్నారు కొందరు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్, కమెడియన్లకు తెలంగాణ యాస పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఆ ధోరణి తగ్గింది. ఈ తరుణంలో తెలంగాణ మాండలికం - యాస వర్సెస్ ఆంధ్ర అంటూ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ట్వీట్లు చేయడం సరికాదు. తెలంగాణ యాసను అంగీకరించలేని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే... వాళ్ళది తప్పే. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, వ్యూస్‌ కోసమో లేదా ఇతరత్రా ఆసక్తులతో, నారో మైండ్‌తో చేసే ట్వీట్‌లను రెండు ప్రాంతాలకు, ప్రజలకు, సినిమా ఇండస్ట్రీకి ఆపాదించి వివాదాలను పెంచడం సరికాదు.

Also ReadDisha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?