IAS Transfers in Telangana: హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ పై వేటు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అరవింద్ కుమార్ ను నియిమించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాస్ రాజు, శ్రీదేవిలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
- మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా దాన కిషోర్
- జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
- వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవి
- మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాకాటి అరుణ
- అటవీ పర్యావరణశాఖ కార్యదర్శిగా వాణి ప్రసాద్
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల డైరెక్టర్ గా ఆర్ వి కర్ణన్
- వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా
- విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశం
- హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి
- రోడ్లు, భవనాలతో పాటు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు
- విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అరవింద్ కుమార్
- కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా బుర్రా వెంకటేశంకు అడిషనల్ బాధ్యతలు
- ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా వాని ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 9 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరిలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధికా గుప్తా, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి. శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ తొప్పో, జనగామ అడిషనల్ కలెక్టర్‌గా పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్, జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదిరవన్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి. గౌతమి, వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్ లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి రాష్ట్ర సర్వీసులకు తిరిగొచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాళి డిసెంబర్ 15న హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, అరవింద్ కుమార్ పై వేటు!
ABP Desam
Updated at:
17 Dec 2023 04:30 PM (IST)
Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, అరవింద్ కుమార్ పై వేటు!
NEXT
PREV
Published at:
17 Dec 2023 04:02 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -