IAS Smita Sabharwal files petition to quash Justice PC Ghosh report: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన IAS అధికారి స్మితా సబర్వాల్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIS)పై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.   ఈ 665 పేజీల రిపోర్టులో తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన కమిషన్ తన వివరణ తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.              

Continues below advertisement


స్మితా సబర్వాల్‌పై చర్యలకు సిఫారసు చేసిన కాళేశ్వరం కమిషన్                    


 "కాళేశ్వరం నిర్మాణాలపై రివ్యూ చేసిన కమిషన్, నా సందర్శనలు, ఫోటోలు, జిల్లా ఫీడ్‌బ్యాక్‌లను రిపోర్టులో పొందుపరిచింది. కానీ, నాకు 8(b) మరియు 8(c) నోటీసులు ఇవ్వకుండా చర్యలు సిఫార్సు చేయడం చట్టవిరుద్ధం" అని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మంగళవారం  దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో నిర్మించారు.  కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్టులో అక్రమాలు, లోపాలు ఉన్నాయని సుప్రీం కోర్టు మాజీ  న్యాయమూర్తి పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రిపోర్టును అగస్టు 2025లో అసెంబ్లీలో టేబుల్ చేశారు.              


తన వాదనలు వినకుండా చర్యలకు సిఫారసు చేశారన్న స్మితా సబర్వాల్                    


ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా  తొమ్మిదేళ్లు పనిచేసిన స్మితా, కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీలో కీలక పాత్ర పోషించారని కమిషన్ తెలిపింది.  మేడిగడ్డ, సుందిళలు,  అన్నారంను పలు సందర్భాల్లో సందర్శించిన  ఫోటోలు తీసుకుని రిపోర్టులో పొందుపరిచారు. జిల్లా అధికారుల ఫీడ్‌బ్యాక్‌లను అప్పటి ముఖ్యమంత్రి KCRకు చెరవేసేవారని తెలిపారు.  నిజాలను క్యాబినెట్ ముందు పెట్టకుండా, అక్రమాలకు అవకాశం ఇచ్చినందుకు  స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి" అని కమిషన్ సిఫార్సు చేసింది.  మొత్తం 19 అధికారులపై చర్యలు సిఫార్సు చేసింది.                      


కాళేశ్వరం అనుతమలు చట్టపరంగానే జారీ                   


 "అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్"గా, తనపై చర్యలు సిఫార్సు చేయడానికి 8(b) చర్యలు తీసుకోవాలని సూచించే నోటీసు,  8(c)  విచారణకు అవకాశం నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ నోటీసుల్లో పేర్కొన్నారు.  తన సందర్శనలు, ఫీడ్‌బ్యాక్‌లు "సెలెక్టివ్"గా రిపోర్టులో పొందుపరిచారని కాళేశ్వరం అనుమతులు "చట్టపరంగా" జారీ అయ్యాయన్నారు.  తనపై  రాజకీయ కారణాలతోనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారని వాదించారు. రిపోర్టును క్వాష్ చేయాలని కోరారు.            


ఇంకా దర్యాప్తు ప్రారంభించని సీబీఐ           
 
కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత  తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పై CBI ఇన్వెస్టిగేషన్ కు సిఫారసు చేసింది. అయితే సీబీఐ ఇంకా విచారణ చేపట్టలేదు.