Republican Leader Remark On Hanuman Statue In US Sparks Row: రిపబ్లికన్‌లో అమెరికాలో జాతి, మత విద్వేషాలు పెంచి రాజకీయాలు చేసే వ్యూహంలో ఉన్నారు. తాజాగా అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్, టెక్సాస్‌లోని శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ వద్ద నిర్మితమైన 90 అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహాన్ని "ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఫాల్స్ హిందూ గాడ్"గా అవహేళన చేయడం వివాదాస్పదమవుతోంది. " అమెరికా క్రిస్టియన్ నేషన్" అని పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలు హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) సహా హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసాయి. డొనాల్డ్ ట్రంప్ పార్టీ నేతగా డంకన్‌కు చెందిన ఈ కామెంట్, అమెరికాలో హిందూ విద్వేషాన్ని ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టెక్సాస్ రిపబ్లికన్ సెనేట్ క్యాండిడేట్ అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. షుగర్ ల్యాండ్‌లోని టెంపుల్ వద్ద హనుమాన్ విగ్రహాన్ని చూపిస్తూ, "వే ఆర్ వీ అల్లోయింగ్ ఎ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ టు బీ హియర్ ఇన్ టెక్సాస్? వీ ఆర్ ఎ క్రైస్టియన్ నేషన్" అని రాశాడు. బైబిల్ ఎక్సోడస్ 20:3-4ను ఉదహరించి, విగ్రహాలు కు వ్యతిరేకమని అన్నాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, హిందూ కమ్యూనిటీలో ఆగ్రహం వ్యక్తమైంది.
డంకన్, టెక్సాస్ రిపబ్లికన్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ, ట్రంప్ సపోర్టర్‌గా ఉన్నారు. అతని వ్యాఖ్యలు అమెరికాలో హిందూ ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఈ 90 అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహం, 'స్టాచ్యూ ఆఫ్ యూనియన్'గా పిలుస్తారు. ఇది అమెరికాలోని అతిపెద్ద హిందూ విగ్రహాల్లో ఒకటి, హిందూ సమాజంలో ఐక్యత, ధైర్యాన్ని సూచిస్తుంది. టెక్సాస్‌లో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ పెరుగుదల కారణంగా ఆలయాల నిర్మాణం పెరిగింది. విగ్రహం నిర్మాణం గత ఏడాది పూర్తయింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) డంకన్ వ్యాఖ్యలను ఖండించింది. "అమెరికా సెక్యులర్ దేశం, మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. ఇలాంటి వ్యాఖ్యలు విద్వేషాన్ని ప్రోత్సహిస్తాయి" అని HAF ప్రెసిడెంట్ సుమీరా గుప్తా అన్నారు. రిపబ్లికన్ పార్టీ డంకన్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.