లోటస్ పాండ్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ధర్నాలకు, నిరసనలకు వెళ్లకపోయినా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన తనకు ఆటంకాలు కల్పించడంపై మండిపడుతున్నారు.
టీఎస్‌పీఎస్పీ పేపర్ లీకేజీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. వాటిని నివృత్తి చేసుకోవడానికి సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరాను అని తెలిపారు. ఒక్కదాన్నే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అందుకే ఉదయం బయల్దేరినట్టు పేర్కొన్నారు. జరుగుతున్న దర్యాప్తుపై అధికారులను కలిపి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు.
కీలకమైన కేసుల్లో దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమకు ఉన్న అనుమానాలు అధికారులకు చెప్పడం తమ బాధ్యత అన్నారు షర్మిల. అందుకే సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరిన తనను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారన్నారు. సిట్ ఆఫీస్‌కు వెళ్లడానికి కూడా ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. దీనిపై ఎవరికీ చెప్పాల్సిన పని కూడా లేదన్నారు. తాను ఏ ధర్నాకో ముట్టడికో పోలేదని అలాంటప్పుడు తనను ఎదుకు నిలువరించారని ప్రశ్నించారు.
తాను ఏమైనా క్రిమినల్‌నా లేదా హంతకురాలినా అని షర్మిల ఫైర్ అయ్యారు. ఎందుకు బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని పోలీసులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు వ్యక్తిగత స్వేచ్చ ఉందా లేదా అని క్వశ్చన్ చేశారు. అసలు తన ఇంటి ముందు వందలాది మంది పోలీసులను ఎందుకు పెట్టారని అడిగారు. వ్యక్తిగత పనులపై తిరిగే స్వేచ్ఛ కూడా తనకు లేదా అని అన్నారు.
బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు షర్మిల. తన దారిన తాను వెళ్తుంటే అడ్డుపడ్డారన్నారు. తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎవరైనా తనపై పడితే భరించలేనని తన రక్ష కోసమే అలా నెట్టేయడం జరిగిందని వివరణ ఇచ్చారు. సెల్ఫ్ డిఫెన్స్ తన బాధ్యత అన్నారు షర్మిల. తనను పురుష సిబ్బంది ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.
ఉదయం నుంచి లోటస్ పాండ్ వద్ద హైడ్రామా నడిచింది. సిట్ ఆఫీస్‌కు వెళ్లేందుకు బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. తను అడ్డుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను అడ్డుకున్న పోలీసులుపై ఫైర్ అయ్యారు షర్మిల. అసలు తనను ఆపే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహహం వ్యక్తం చేశారు. పోలీసులు రిక్వస్ట్ చేస్తున్నా... షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు, ప్రభుత్వం చర్యలకు నిరసగా అక్కడే నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఒంటరిగా రోడ్డుపై కూర్చున్న ఆమెను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే తను పదే పదే అడ్డుకుంటున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్స్ నుంచి విదిలించుకొనే క్రమంలో ఆమెపై చేయిచేసుకున్నారు. తర్వాత నడుచుకుంటూ ఫాస్ట్‌గా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇంతలో షర్మిల ఆదేశాలతో కారు తీసేందుకు తన డ్రైవర్ ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఎస్సై ఆ డ్రైవర్‌ను బయటకు లాగిపడేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల... తన డ్రైవర్‌పై ఎందుకు చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. అసలు తన డ్రైవర్‌పై చేయి చేసుకోవడానికి మీరు ఎవరూ అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఎస్సైపై చేయి చేసుకున్నారు. షర్మిల చర్యతో షాక్ తిన్న ఎస్సై కాసేపటికి తేరుకొని తిరిగి సమాధానం ఇచ్చారు. అసలు తనను కొట్టడానికి మీరెవరూ అంటూ నిలదీశారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తనను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై ఆగ్రహించిన షర్మిల రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేశారు.