New Ration Cards In Telangana | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం జనం భారీ సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. తొమ్మిది పదేళ్ల నుంచి కొత్త కార్డులు జారీ చేయకపోవడంతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో జనం అప్లై చేస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో నిర్వహించిన సభల్లో, గ్రామసభల్లో, మొన్న నిర్వహించిన కులగణన సర్వే సమయంలో కూడా కొత్త కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్‌లు అధికారులు తిరస్కరించారు. డూప్లికేషన్ పేరుతో చాలా దరఖాస్తులు కొత్త కార్డుల జాబితాలో ఉంచలేదు. తమకు గతంలో ప్రత్యేకంగా కార్డు లేదని చెబుతున్న ప్రజలకు పదే పదే దరఖాస్తు చేస్తున్నారు. అలాంటి వాళ్లు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అందుకే చాలా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతున్నాయి.
ఇప్పటికే ఇంట్లో ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న వాటిని ఆధార్ కార్డు ఇతర మార్గల ద్వారా అధికారులు తొలగిస్తున్నారు. కొత్తగా కాపురం పెట్టామని వేరే కారణాలతో రేషన్ కార్డు కావాలని దరఖాస్తు చేస్తున్నారు. వీళ్ల పేర్లు వేరే కార్డుల్లో ఉండటంతో వారి అప్లికేషన్లను అధికారులు రిజెక్ట్ చేస్తున్నారు.
అందుకే ఇకపై రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్న వాళ్లు కచ్చితంగా ఇప్పటికే తమ పేరు ఏ రేషన్ కార్డులో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఆ పేర్లు తొలగించుకునేందుకు ముందుగా దరఖాస్తు చేయాలి. అందులో పేర్లు తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పుడే డూప్లికేషన్ లేకుండా కొత్త కార్డు దరఖాస్తును అధికారులు తిరస్కరించకుండా ఉంటారు.
ఇలా పాత రేషన్ కార్డులో పేర్లు తొలగించుకోకుండా ఎన్నిసార్లు కొత్త కార్డుకు దరఖాస్తు చేసినా అధికారులు తిరస్కరిస్తూనే ఉంటారు. అందుకే ముందుగా మీ పేరు పాత రేషన్ కార్డులో ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఎవరు తమ పేర్లను పాత రేషన్ కార్డు నుంచి తొలగించుకోవాలి అంటే...
కొత్తగా వివాహం అయిన వాళ్లు: కొత్తగా పెళ్లిన అయిన దంపతుల పేర్లు అంతకు ముందే తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉంటాయి. అలాంటి వాళ్లు దాన్ని గమనించకుండా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేస్తే మాత్రం తిరస్కరణకు గురి అవుతుంది. ముందు తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచిపేర్లు తొలగించాలి.
చనిపోయిన వాళ్ల పేర్లు: మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలి. వాళ్లే యజమానులుగా ఉంటే కూడా ఆ కారణంతో మీ దరఖాస్తు తిరస్కరణకు గురి అవుతుంది. రీలొకేషన్: పని లేదా ఇతర కారణాల వల్ల బయటకు వెళ్లే సభ్యులు వివరాలను కూడా అప్‌డేట్ చేయాలి.
ఇలా మీ పేరు ఏ రేషన్ కార్డులో ఉందో తెలుసుకునేందుకు మీ డీలర్‌ను సంప్రదిస్తే వివరాలు తెలుస్తాయి. మీరే ఆన్‌లైన్ కూడా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం పౌరసరఫరాల వెబ్‌సైట్‌లో కూడా మీవివరాలు ఉంటాయి చూసుకోవచ్చు.
Also Read: తెలంగాణలో రేషన్‌కార్డు దరఖాస్తులపై కీలక అప్‌డేట్- కంగారు పడొద్దని అధికారుల సూచన