Telangana Womens Commission | హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ తమ సభ్యులపైనే చర్యలు తీసుకుంటున్నారు. ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు చైర్ పర్సన్ నేరెళ్ల శారద నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వాలని సెక్రటరీని ఆదేశించారు. మహిళా కమిషన్ లో విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ కు తమ ఆఫీసులోనే రాఖీ కట్టడంపై ఆగ్రహం చేశారు. మహిళా కమిషన్  నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులను నేరేళ్ళ శారద హెచ్చరించారు.


మహిళా కమిషన్ ప్రాంగణంలో మొబైల్స్ కు అనుమతి లేకపోయినా సీక్రెట్ గా సెల్‌ఫోన్ తీసుకెళ్లి రాఖీ కడుతూ వీడియోలు రికార్డ్ చేయడంపై చైర్ పర్సన్ సీరియస్ అయ్యారు. తమ ఆఫీసులో కేటీఆర్ కు రాఖీ కట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు కమిషన్ న్యాయ సలహా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. మహిళను కించపరుస్తూ కామెంట్స్ చేసిన వారికి మహిళా కమిషన్ ఆఫీసులోనే, మొబైల్స్ అనుమతి లేకున్నా ఎలా ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని..  విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో లీగల్ ఒపీనియన్ తర్వాత తమ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమైంది.