HCU Land Dispute | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములపై గత కొంత కాలంగా విద్యార్దులు ఆందోళనలు చేస్తున్నారు. యూనిర్సిటీ క్యాంపస్ లోపలే ప్రతీ రోజూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నిరసనలు తారాస్దాయికి చేరాయి. జేసిబిలు క్యాంపస్ లోపలికి రావడం, వివాదాస్పద భూముల్లో చెట్లను తొలగించేందుకు సిద్దమవ్వడంతో విద్యార్దులు అడ్డుకున్నారు. విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న విద్యార్దులు జేసిబిలను వెనక్కు పంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్దులను బలవంతంగా అదుపులోకి తీసుకుని , పోలీసు వాహనాల్లో మాాదాపూర్ పోలీస్టేషన్ కు తరలించారు.
వివాదానికి కారణాలేంటి..?
హెచ్ సీయూ భూముల వివాదంపై విద్యార్దుల వాదనలు ఓలా ఉంటే, ప్రభుత్వం జీవోలు, నిర్ణయాలు మరోలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచెగచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడినప్పుడు 2300 ఎకరాల భూములు యూనివర్సిటీ పరిధిలో ఉండేవి. ఆ తరువాత కాలంలో కొంత మేర ఆక్రమణలు పోగా ప్రస్తుతం యూజీసి లెక్కల ప్రకారం ప్రస్తుతం 1800 ఎకరాల భూములు మాత్రమే ఉన్నాయి. అయితే అందులో తాజాగా 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఇక యూనివర్సిటీకి మిగిలేది 1400 ఎకరాల భూములు మాత్రమే. ఈ భూముల్లో మష్ రూమ్ రాక్ వంటి రెండువేల సంవత్సరాల క్రితం చరిత్రాత్మక ఆనవాళ్లతోపాటు, జీవవైవిద్యానికి ప్రతీకగా నిలిచిన ఈ భూములను ప్రభుత్వం ఐటీ సంస్దలకు కేటాయిచడం సరికాదంటూ విద్యార్ది సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, ఇటీవల ఈ భూములు తెలంగాణ రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్దకు (టిజిఐఐసి) కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీ విద్యార్దులు.
హెచ్.సి.యు. భూములపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందా..?
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ లో 400 ఎకరాల వివాదాస్పద భూములపై ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఈ భూములకు , సెంట్రల్ యూనివర్సిటీకి అస్సలు సంబంధంలేదంటున్నారు తెలంగాణ సిఎం , మంత్రులు. కంచెగచ్చిబౌలిలోని సర్వేనెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములు 2003లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ ఏర్పాటుకు కేటాయించింది. ఆ భూముల్లో అప్పట్లో ప్రాజెక్టు ప్రారంభించపోాాగా, నిబంధనలు ఉల్లంఘించడంతో 2006లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏంజీకి కేటాయించిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో రద్దుపై
ఐఏంజీ భారత్ హైకోర్టును ఆశ్రయించగా 2024 మార్చి 7న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్దిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. తిరిగి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఐఏంజీ భారత్ సుప్రీం కొోర్టుకు వెళ్లింది. 2024 మే 3న ఐఏంజీ భారత్ పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.దీంతో ఎట్టకేలకు సెంట్రల్ యూనివర్సిటిలోని 400 ఎకరాలు భూములు తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోొకి వచ్చాయి అంటోంతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు ఈ భూములకు అటవీశాఖకు అస్సలు సంబంధంలేదంటోంది.
వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఏం చేయబోతోంది..?
గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పుతో భూములపై హక్కులు సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ 26న టిజిఐఐసికి ఈ భూములు కేటాయిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ భూముల్లో పికాక్ లేక్ , బఫెలో లేక్ వంటివి లేవని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ 400 ఎకరాల భూముల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుతోపాటు ప్రపంచస్దాయి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దమైయ్యింది. ప్రతిపక్షాలు మాత్రం విద్యార్దుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతోపాటు విద్యార్దుల డిమాండ్ రాష్ట్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలిని కోరుతున్నప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వం ఎవరెలా స్పందించినా మేము మాత్రం భూముల విషయంలో వెనక్కు తగ్గబోమంటూ తేల్చి చెప్పేస్తోంది.