Bhu Bharathi Portal Telangana: ధరణి కారణంగా వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం భూభారతి పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. మార్పులు చేర్పులు, సమస్యల పరిష్కారం మరింత సులభం అవుతుందని మంత్రులు చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక రూల్స్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అంతే కాకుండా మార్పులు చేర్పులు చేసే అధికారులం ఆర్డీవోల, జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది.
ఇప్పటి వరకు ఉన్న డేటాతోనే భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రత్యేకంగా ఎలాంటి సర్వేగానీ, భూరికార్డుల్లో మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసింది. ధరణిలో ఉన్న డేటానే ఈ భూభారతిలో ఉందని తెలిపింది. ఇందులో ఉన్న భూరికార్డుల్లో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించింది. ఏ తప్పులు ఎలా సరిచేసుకోవాలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల్లో వెల్లడించింది.
వీలునామా, వారసత్వ సమస్యలు ఉంటే మ్యుటేషన్ కోసం భూభారతి పోర్టల్‌లోనే తహసీల్దార్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసినప్పుడు వారసులందరీ అంగీకార పత్రం సబ్‌మిట్ చేయాలి. దీనికి సర్వే మ్యాప్ కూడా జత చేయాలి. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎంఆర్వో కార్యాలయం ప్రత్యేకంగా నోటీసులను తహసీల్దార్ ఆఫీస్, గ్రామపంచాయతీ ఆఫీసుల్లో అంటిస్తుంది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెప్పవచ్చు. దీనికి ఏడు రోజుల సమయం ఇస్తారు. ఉన్న సమస్య తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
మీ వివాదాస్ప ల్యాండ్‌పై అనుమానం ఉంటే అధికారులు నేరుగా మీ భూమిని పరిశీలించవచ్చు. ఎన్ని విచారణలు చేసినప్పటికీ 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి. ఇలా పరిష్కరించి పట్టాదార్ పాస్‌బుక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మ్యుటేషన్ సమస్యలే కాకుండా తప్పులు కూడా సరిచేసకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఏడాది లేదా. భూమికి సంబంధించిన వివరాలు రికార్డు చేసినప్పటి నుంచి ఏడాది లోపు ఫిర్యాదు చేయాలి. దానికి తగ్గ ఆధారాలు సమర్పించాలి. అప్పుడే దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత హక్కుదారులకు నోటీసులు జారీ చేస్తారు. గ్రామపంచాయతీలో కూడా నోటీసులు ప్రచురిస్తారు.దీనిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. దీనికి కూడా ఆధారాలు సమర్పించాలి. ఏదైనా సరే ఏడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ల పేరు మీద భూరికార్డులు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పడుతుంది.
కోర్టుల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన భూములపై హక్కులు పొందిన వాళ్లు ఆర్టీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వాళ్లు నోటీసులు ఇస్తారు. అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమర్పించాలి. లేకుంటే ముఫ్ఫై రోజుల్లో సమస్యను పరిష్కరించి ఆదేశాలు జారీ చేస్తారు. ఎలాంటి వివాదాలు లేని భూములకు త్వరలోనే భూధార్ ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధపడుతున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం భూభారతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీల కోసం కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు.
గతంలో ప్రజలు ఫేస్ చేసిన ఇబ్బందులు తొలగించాలనే ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముందుగా వాటి పని పట్టాలని బావిస్తోంది. అందుకే నేటి నుంచి గ్రామాల్లో పట్టణాల్లలో విస్తృతంగా అవాగాహన కార్యక్రమాలు చేపట్టనుంది.