Weather Latest News: ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఈస్ట్ వెస్ట్ షీర్‌ జోన్ 20 డిగ్రీస్ నార్త్ లో సముద్రం మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఉత్తర ద్వీపకల్ప భారత్ మొత్తం కేంద్రీకృతమైంది. నిన్న వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఇవాళ ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. 


ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణలో అనేక చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా చోట్ల భారీ వర్షాలు పడతాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. మిగతా చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు.






హైదరాబాద్‌ వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్నిసార్లు తీవ్రమైన జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ నైరుతి దిశ ఉపరితల గాలులు గాలి వేగం గంటకు 8 నుంచి 14 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.6 డిగ్రీలు, 21.6 డిగ్రీలుగా ఉంది.