తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 3 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన చర్యలను అధికారులు, జిల్లా యంత్రాంగం చురుగ్గా చేపడుతోంది. గ్రామ సర్పంచులసహా వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు.
పల్లె ప్రగతి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ మండల సర్పంచ్‌ల సంఘం బాయ్‌కట్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు కూడా. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన సర్పంచులు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించాలని బహిష్కరించారు. తమ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
3 ఏళ్ల కిందట గ్రామంలో పల్లె ప్రగతి కింద చేసిన అభివృద్ధి పనులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు రాలేదని వాపోయారు గ్రామ సర్పంచ్‌లు. గ్రామంలో చేపట్టిన సిసి రోడ్డు, వైకుంఠ ధమాలను అప్పులు తెచ్చి పనులు చేసినట్టు చెప్పారు. కానీ ప్రభుత్వం ఇంత వరకు తమకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే రానున్న పల్లె ప్రగతి పూర్తిగా బైకాట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమం తాండూర్ నియోజకవర్గంలోని పెద్దముల్ యాలాల బాసిరాబాద్ మండలంలో జరిగింది.
గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం కేంద్రంలో కూడా సర్పంచ్‌లు ఆందోళన బాట ట్టారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల చేసేంత వరకు పల్లె ప్రగతి, సమీక్ష సమావేశాన్ని బహిష్కరించినట్టు ప్రకటించారు. ఎంపీడీఓ కార్యాలయంలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు నిరసన తెలిపారు. ఆత్మగౌరవం లేకుండా చేస్తే సహించేది లేదని నినదించారు.