Union Minister Kishan Reddy: హైదరాబాద్ బీజేపీ బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. బర్కత్‌ పురాలోని నగర కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి జెండా వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అసాధారణ ధైర్యవంతులైన స్త్రీపురుషులను స్మరించుకుందమన్నారు. అలాగే ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసి అద్భుతమైన భారదేశాన్ని నిర్మించుకుందామని చెప్పుకొచ్చారు.