ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ(ములుగు, సిద్ధిపేట జిల్లా), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను అందబాటులో ఉంచారు. జాబితాలో అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆగస్టు 18 సాయంత్రం 5.00 గంటల లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సీట్ల కోసం ఎంసెట్ 2023 బైపీసీ స్ట్రీమ్ రాసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నోటిఫికేషన్ ద్వారా కింది కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.


సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..


కోర్సులు..


➥బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు)


➥ బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్(4 ఏళ్ళు) 


➥ బీఎస్సీ  (ఆనర్స్) హార్టికల్చర్ (నాలుగేళ్లు) 


➥ బీఎఫ్‌ఎస్సీ  (4 ఏళ్ళు) 


➥ బీవీఎస్సీ AH (5.1/2 ఏళ్ళు)


ఈమెయిల్: admissions.pjtsau@gmail.com


వెబ్‌సైట్


ALSO READ:


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 17న వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌
తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. పాలిసెట్‌-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్‌ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా వాక్‌ఇన్ కౌన్సెలింగ్‌‌కు హాజరుకావచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ఫీజు రూ. 20,000 (యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లకు), రూ.22,000 (ప్రైవేటు పాలిటెక్నిక్‌లకు) చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ తీసుకొని కౌన్సెలింగ్‌‌కు హాజరుకావాలి. గతంలో దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం యశస్వి’ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ దరఖాస్తు గడువు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 11న ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది 30 వేల స్కాలర్‌షిప్స్‌ కోసం ఎన్‌టీఏ యశస్వి (యంగ్‌ అచీవర్స్‌ స్కాలర్‌షిప్‌ అవార్డు స్కీమ్‌ ఫర్‌ వైబ్రెంట్‌ ఇండియా) పరీక్ష-2023 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..