TSRTC special buses for Arunachala Giri Pradakshina tour: 
పౌర్ణమి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మరోసారి అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. జులై ౩1న పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులను TSRTC ఏర్పాటు చేసింది. ఈ టూర్ కు ముందస్తు రిజర్వేషన్‌ శుక్రవారం మొదలైంది. అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే బస్సులు అక్కడికి చేరుకుంటాయి. భక్తులు http://tsrtconline.in సైట్‌లోకి వెళ్లి టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రెండు రోజుల ఈ రౌండ్‌ ట్రిప్‌లో కాణిపాక విఘ్నేశ్వరుని, వెల్లూర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనం కూడా ఉంటుందని పేర్కొన్నారు.


‘గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదర్శనకు భక్తుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226257, 9959224911 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఎంబీజీఎస్, జేబీఎస్ (JBS), దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో టికెట్ ధర రూ.3,600గా ఆర్టీసీ నిర్ణయించింది.


టీఎస్ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ వివరాలిలా..
- జులై 31న అరుణాచల గిరి ప్రదర్శన సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. 
సర్వీసు నంబర్ 98889 బస్సు జులై 30న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది.
- జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకంలోని వినాయకుడి దర్శనం ఉదయం 8 గంటలకు చేసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బస్సు బయలుదేరి, మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులోని వెళ్లూరుకు చేరుతుంది. అదే రోజు రాత్రి (జులై 31న) రాత్రి 9 గంటలకు బస్సు అరుణాచలం చేరుకుంటుంది. 
- ఆగస్టు 1న గిరి ప్రదర్శన పూర్తి చేసుకున్నాక.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు బస్సు హైదరాబాద్ కు బయలుదేరుతుంది. ఆగస్టు 2న ఉదయం 6 గంటలకు బస్సు ఎంజీబీఎస్ కు చేరుకుంటుంది. 






ఆర్టీసీ జులై 3న అందుబాటులోకి తెచ్చిన 'అరుణాచ‌లం టూర్ ప్యాకేజీ'కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 15 ప్ర‌త్యేక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులను ఏర్పాటు చేయ‌గా.. 13 బ‌స్సుల్లో సీట్ల‌న్నీ ఫుల్ అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. మిగిలిన రెండు బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కొన‌సాగుతోందన్నారు. రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన గంట‌ల వ్య‌వ‌ధిలోని భ‌క్తులు టికెట్ల‌ను బుకింగ్ చేసుకోవడం శుభపరిణామం అని ఆర్టీసీ పేర్కొంది. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial