చేసిన తప్పు ఎవర్నీ కుదురుగా ఉండనివ్వదు. వారిది అదే పరిస్థితి. వాళ్లే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులు. ప్రధాన నిందితులతో చేతులు కలిపి పేపర్ తీసుకున్న పాపానికి నెల రోజుల పాటు నిద్రలేకుండా జాగారం చేశారు. గుడులు గోపురాలు సందర్శించారు. కనిపించిన దేవుడిని మొక్కారు. తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని వేడుకున్నారు. అయినా పాపం పండింది. కటకటాలు లెక్కించాల్సి వచ్చింది.
తెలంగాణ పబ్లిష్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసు నిందితుల్లో సుస్మిత, లౌకిక్ కూడా ఉన్నారు. సుస్మిత సాఫ్ట్ వేర్ ఇంజినీర్. గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చాక ఉద్యానికి రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. గ్రూప్-1 రాశారు. అయితే ఆమె చేసిన చిన్న తప్పిదం కారణంగా గ్రూప్ వన్ రిజల్ట్ రాలేదు. ఆమె రిజల్ట్‌ను విత్‌హెల్డ్‌లో పెట్టారు. బాగా రాశానన్న కాన్ఫిడెన్స్‌తో పలుమార్పు టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లి తన రిజల్ట్ రాకపోవడానికి, చేసిన తప్పు సరిచేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు.
గ్రూప్ వన్ రిజల్ట్స్ విషయం మాట్లాడటానికి వెళ్లిన సుస్మిత, ఆమె భర్త లౌకిక్‌కు అక్కడే పరిచయమయ్యాడు ప్రవీణ్. ఆమె డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష కూడా రాస్తున్నట్టు గ్రహించాడు. అంతే సైలెంట్‌గా వారితో బేరం పెట్టాడు. రాబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ తనవద్ద ఉందని.. చెప్పి డబ్బులు వసూలు చేశాడు. వీళ్ల మధ్య ఆరు లక్షలకు బేరం కుదిరింది.
భార్య సుస్మిత కోసం ప్రవీణ్‌కు ఆరులక్షలు ఇచ్చాడు లౌకిక్. పరీక్షను విజయవంతంగా రాశారు సుస్మిత. గ్రూప్ -1 రిజల్ట్ వచ్చినా రాకున్నా డీఏఓ ఉద్యోగం మాత్రం వస్తుందని సంతోషంగా ఉన్నారు. ఇంతలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ చూసిన సుస్మిత, లౌకిక్ గుండెళ్లో రాయిపడ్డట్టు అయింది. రోజుకొకర్ని అరెస్టు చేయడం... ప్రవీణ్‌తో జరిగిన ఆర్థిక లావాదేవీలు, ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు సీరియస్ అవుతండటంతో వారిలో టెన్షన్ మరింత పెరిగింది.
చేసింది తప్పని దొరికిపోతున్నామని భయం పట్టుకుంది సుస్మిత, లౌకిక్. అంతే తిరుపతి నుంచి షిర్డీ వరకు కనిపించన ఆలయాలకు వెళ్లారు. నెలరోజుల పాటు నిద్రాహారాలు లేకుండా తమను రక్షించాలని దేవుణ్ని వేడుకున్నారు. ఎన్ని మొక్కులు చెల్లించుకున్నా.. మరిన్నె ముడుపులు కట్టినా వారి వృతాలు, పూజలు ఫలించలేదు. చివరకు ప్రవీణ్‌తో జరిపిన లావాదేవీలు, సంబాషణలు, చాటింగ్ ఆధారంగా సుస్మిత, లౌకిక్‌ను ఐదు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు.