TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

Electronic Devices Used in TSPSC Exam: ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించి షాకయ్యారు. ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ అయ్యారు.

Continues below advertisement

Electronic Devices Used in TSPSC Exams: టీఎస్ పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించి షాకయ్యారు. ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

Continues below advertisement

ప్రత్యేక దర్యాప్తు టీమ్ (SIT) టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు దాంతో TSPSC Paper Leak కేసులో మెుత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరుకుంది. నిన్న అరెస్టయిన వారిలో సైతం ఏఈఈ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవికిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రమేష్ సైతం మరో 20 మందికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు చెప్పాడు. కోచింగ్ సెంటర్లో పరిచయమైన వారికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు వివరాలు సేకరించారు. రమేష్ ఇచ్చిన సమాచారంతో సోమవారం నాడు ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రోబో, శంకర్ దాదా సినిమా చూపించిన నిందితులు!
వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు రమేష్. అశోక్ నగర్‌ లోని ఓ కోచింగ్ సెంటర్ రమేష్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. అదే సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురికి ఏఈఈ పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఎగ్జామ్ హాల్ కు వీళ్లు బ్లూ టూత్ లతో వెళ్లారు. రమేష్ బయట నుంచి ఆన్సర్లు చెబుతుంటే రోబో, శంకర్ దాదా సినిమా సీన్ తరహాలో ముగ్గురు నిందితులు ఆన్సర్లు విని ఓఎంఆర్ లో బబులింగ్ చేసినట్లు గుర్తించి అధికారులు షాకయ్యారు. అసలు ఎగ్జామ్ హాల్ కు చిన్న వస్తువు తీసుకెళ్లినా అనుమతి లేదు, మరి నిందితులు బ్లూ టూత్ డివైజ్ లతో ఎలా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లారు.. ఏ సెంటర్ లో ఎగ్జామ్ రాశారు అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది సిట్. వీరికేనా ఇంకా ఎవరికైనా రమేష్ పేపర్ విక్రయించాడా, ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఇంకెంత మంది టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ రాశారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ జీవితాలు నాశనం అవుతున్నాయంటూ 30 లక్షల మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షలనైనా పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఎస్ పీఎస్సీని కోరుతున్నారు.

స్కూల్ పిల్లలు చెప్పే (A+B)2 ఫార్ములాలు సైతం ఏఈ ఎగ్జామ్ టాపర్లు చెప్పలేకపోయారు. కేవలం రెండు నెలల్లోనే ఎగ్జామ్ లో రాసిన ఆన్సర్లను చెప్పలేక కొందరు నీళ్లు నమిలారు. దాంతో ఏ స్థాయిలో పేపర్ లీక్ అయింది, మరిన్ని అరెస్టులు జరుగుతాయని అర్థమవుతోంది.

Continues below advertisement