Traffic Restrictions: భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం  ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.



  • బాలాపూర్ నుంచి నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.

  • చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను డైవెర్ట్ చేస్తారు.
    కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌ బండ్‌పైకి అనుమతి ఉండదు. సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.

  • టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లింపు ఉంటుందని ని పోలీసులు తెలిపారు. 

  • చాపెల్ రోడ్డు, జీపీవో గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ప్రవేశం, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.

  • హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది. 



నిమజ్జనం చేశాక ఎలా వెళ్లాలంటే
ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించబడవు.
 
ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు
ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే వారి కోసం సాగర్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను పోలీసులు సిద్ధం చేశారు. అక్కడ మాత్రమే వాహనదారులు వాహనాలను నిలపాలని సూచించారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్‌లో పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


నిమజ్జనం రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్‌కు కొద్ది దూరంలోనే సిటీ బస్సులను నిలిపివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం బస్సులను మాసాబ్ ట్యాంక్, కూకట్ పల్లి బస్సులు ఖైరతాబాద్ చౌరస్తా, సికింద్రాబాద్ బస్సులు సీటీవో, ప్లాజా, ఎస్ బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులు రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్ సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం, చాదర్ ఘాట్, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హట్స్, మిదాని బస్సులు ఐఎస్ సదన్, అంతర్ నగర బస్సులు నారాయణ గూడ వైఎంసీఏ వద్ద నిలిపివేయనున్నట్లు తెలిపారు.


ఓఆర్ఆర్ మీదుగా ప్రైవేటు బస్సులు
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు, అలాగే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతి ఉండదు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్‌ 7 వైపు నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ చౌరస్తా, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.


బెంగళూరు రహదారిపై వచ్చే వాహనాలు ఆరాంఘర్ చౌరస్తా, చంద్రాయణగుట్ట చౌరస్తా, ఐఎస్ సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘాట్ మీదుగా మళ్లించనున్నారు. ముంబయి జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను.. గోద్రెజ్ కూడలి, నర్సాపూర్ చౌరస్తా, బోయిన్ పల్లి, జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, అడిక్ మెట్, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయని తెలిపారు.