Hyderabad News: తెలంగాణలో అప్పుడే కళాశాలల ప్రవేశాల హడావుడి మొదలైంది. ఎంసెట్‌ ఫలితాలు విడుదలకావడంతోపాటు జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మంచి కాలేజీ కోసం వెతుకులాట ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా వందలాది ఇంజినీరింగ్ కళాశాలు ఉన్నా...అందరి అప్షన్‌ మొదట హైదరాబాదే. అందుకే  హైదరాబాద్‌లోని టాప్‌ ఇంజినీరింగ్ కళాశాలలు ఒకసారి చూసేద్దాం.....

 

హైదరాబాద్‌లో టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు

హైదరాబాద్‌ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కలల ప్రపంచం...ఇంటర్మీడియట్‌ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా...హైదరాబాద్‌ వెళ్లి మంచి కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేయాలని అందరూ ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ల ఆశలను ఏమాత్రం ఒప్పుచేయదీ భాగ్యనగరం. పదుల సంఖ్యలో యూనివర్సిటీలు,వందలాది కాలేజీలు, లెక్కకు మించి ఇనిస్టిట్యూట్‌లతో మెట్రోనగరం రారమ్మని పిలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇంజినీరింగ్ ప్రైవేశాల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా  హైదరాబాద్‌లోని టాప్ ఇంజినీరింగ్ కళాశాలల వివవరాలేంటో ఒకసారి చూద్దాం...

 

ఐఐటీ హైదరాబాద్

 ఇంజినీరింగ్ చదవాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి కల..ఐఐటీలో సీటు సంపాధించడం. దీనికోసం ఇప్పుడు ఆరోతరగతి నుంచే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో సీట్లు JEE మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును బట్టి కేటాయిస్తారు. దేశంలోని విద్యార్థులంతా దీనికి పోటీపడతారు. C.S.E, ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్, మెకానికల్‌, బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్‌మేటిక్‌, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, బయోమెడికల్‌తోపాటు ఇతర కోర్సులను అందిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ పటాన్‌చెరువుకు సమీపంలో ఉంది. 

 

ట్రిఫుల్‌ ఐటీ 

అలాగే గచ్చిబౌలిలో ఉన్న ట్రీపుల్‌ ఐటీలోనూ  ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఈతోపాటు  కంప్యూటర్‌సైన్‌ మరియు ఎంఎస్‌ కోర్సు అందిస్తోంది. వీటితోపాటు ఈసీఈ సహా తొమ్మిది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

అనురాగ్ విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌కు సమీపంలోని ఘట్‌కేసర్‌లో ఉన్న అనురాగ్ విశ్వవిద్యాలయం 15 ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్ ర్యాంకును బట్టి ఈ కళాశాలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. సీఎస్‌ఈ,సివిల్, ఈసీఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్‌ లెర్నింగ్, ఈఈఈ, ఐటీ,మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులతోపాటు ఇతర కోర్సులను అందిస్తోంది.

 

గోకరాజు గంగరాజు కాలేజీ

కూకట్‌పల్లికి సమీపంలోని బాచ్‌పల్లిలో ఉన్న గోకరాజు గంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ సైతం హైదరాబాద్‌లోని టాప్‌ కాలేజీల్లో ఒకటి. తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఈ కాలేజీలో సీట్లు కేటాయింపు ఉంటుంది. నాక్ అక్రిడియేషన్ గ్రేడ్ A కలిగిన ఈ కళాశాల 10 ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. సీఎస్‌ఈలో 180 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంజినీరింగ్ మెషిన్‌ లెర్నింగ్‌లో 180 సీట్లు, ఈసీఈలో 120 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్‌ సిస్టంలో 60 సీట్లు, ఈఈఈలో 60 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్‌లో 60 సీట్లు, మెకానికల్ 60 సీట్లు, డేటా సైన్స్‌లో  120 సీట్లు, ఐటీలో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 

VNR విజ్ఞాన్‌ జ్యోతి కాలేజీ

బాచ్‌పల్లిలోనే ఉన్న మరో టాప్‌ కాలేజీ VNR విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ.. తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇక్కడ కూడా సీట్లు కేటాయింపు ఉంటుంది. 15 ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉండగా...ఈసీసీలో 240 సీట్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్-180

మెకానిక్ -120, ఐటీ- 180, ఈఈఈ- 120, సివిల్ -120, ఈసీఈ-240, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్ -60సీట్లతో పాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది

 

CBIT

హైదరాబాద్ గండిపేటలో ఉన్న మరో టాప్ కళాశాల చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT). తెలంగాణ ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయిస్తారు. దాదాపు 20కి పైగా ఇంజినీరింగ్ కోర్సులను సీబీఐటీ అందిస్తోంది.సీఎస్‌ఈ, బయోటెక్నాలజీ, ఐవోటీ మరియు సైబర్ సెక్యూరిటీ-బ్లాక్ చైన్‌ టెక్నాలజీ, మెకానిక్‌, ఈసీఈ, సివిల్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌, ఈఈఈ, కెమికల్ ఇంజినీరింగ్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులను అందిస్తోంది.

 

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్‌

ఎరోనాటికల్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సును అందిస్తోంది ఈ కళాశాల. హైదరాబాద్‌లోనే ఉన్న ఈ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈఈఈ, మెకానికల్,ఈసీఈ, డేటా సైన్స్‌,ఈఈఈ, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది.

 

మహీంద్రా యూనివర్సిటీ

బాచ్‌పల్లిలోనే ఉన్న మరో యూనివర్సిటీ మహీంద్రా. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఈ యూనివర్సిటీలో సీట్ల కేటాయింపు ఉటుంది. దాదాపు 10కి పైగా ఇంజినీరింగ్ కోర్సులను మహీంద్రా విశ్వవిద్యాలయం అందిస్తోంది.సీఎస్‌ఈ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, మెకానికల్,కాంప్యూటేషనల్ బయోలజీ, ఈసీఈ, సివిల్, నానోటెక్నాలజీ,ఈసీఈ కోర్సులను ఈ కాలేజీ అందిస్తోంది.

 

JNTUH

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, పైవేట్ ఇంజినీరింగ్ JNTUH అనుబంధ కళాశాలుగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లి క్యాంపస్‌లో దాదాపు 27 ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా ఇక్కడ సీట్ల కేటాయింపు ఉంటుంది.

 

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా  విశ్వవిద్యాలయం సైతం నాలుగు ఇంజినీరింగ్ కోర్సులను అందిస్తోంది. తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ఇక్కడ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫుడ్‌ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఇంజినీరింగ్ కళాశాలకు భిన్నంగా ఎక్కడా లేని కోర్సులను మాత్రమే ఉస్మానియాలో అందుబాటులో ఉంచారు.రెగ్యూలర్ ఇంజినీరింగ్ కోర్సులకు భిన్నంగా చదవాలనుకునే వారికి మంచి అవకాశం.

 

వీటితోపాటు వందలాది ప్రైవేట్, ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్నాయి. పిట్స్‌ పిలానీ క్యాంపస్, కేఎస్‌ వర్సటీ క్యాంపస్‌, గీతం వర్సిటీ క్యాంపస్‌, విజ్ఞాన్ వర్సిటీ క్యాంపస్‌,CMR, గురునానక్‌, వర్థమాన్‌, కేజీ రెడ్డి, మల్లారెడ్డి, నల్లమల్లారెడ్డి, విద్యాజ్యోతి,అవంతి, బ్రిలియంట్‌,  మాతృశ్రీ, స్పూర్తి, స్టాన్లీ, సెయింట్ పీటర్స్‌, స్పూర్తి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, హోలీమేరీ, వాసవీ, మర్రి లక్ష్మణ్‌రెడ్డి కాలేజీ, మహాత్మా గాంధీ, శ్రీనిధి, CMR, నారాయణమ్మ, TKR, కేశవ మెమోరియల్, విజ్ఞాన్ భారతి, గురునానక్‌, మహావీర్‌, డెక్కన్‌ వంటి ఎన్నో కళాశాలలు అందుబాటులోఉన్నాయి. కళాశాలల్లో ఉండే సౌకర్యాలు, ఫ్యాకల్టీ, కోర్సులు, అందుబాటులో ఉన్న ఫీజులు, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ వంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాతే కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది...