Auto Drivers Strike | హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం (ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకే. బోసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైవర్ల నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. కార్మికులందరూ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త నల్లెల కిశోర్ ఆధ్వర్యంలో దోమలగూడలోని పార్టీ ఆఫీసులో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేల ఆర్థిక సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆటో, క్యాబ్ మీటరు ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ బాల్‌రాజ్‌గౌడ్, శంకర్‌రెడ్డి, యాదగిరి, కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
